ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత సంచలనం సృష్టించిందో తెలిసిందే. ఆ తర్వాత కూడా ఈ కేసు ట్విస్టుల మీద ట్విస్టులతో తెగ ఆసక్తి రేపుతోంది. ఉదయ్ అరెస్టుతో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి. ఉదయ్ కృష్ణా రెడ్డి ఉదంతం ఒక్కటే కాకుండా తెలంగాణాలో నిత్యం ఏదో ఒక పోలీసు అధికారి మీద ఇలాంటి ఆరోపణలు రావడం నిత్యకృత్యం అయిపొయింది. ఈమధ్య జూబ్లీహిల్స్, మలక్ పేట, దోమల గూడ పోలీసులపై ఇలాంటి అక్రమ సంబంధాలకు సంబందించిన ఫిర్యాదులు వచ్చాయి. ఇది పోలీసులకు తలవొంపులు తెస్తుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.
పోలీసులకు సజ్జన్నార్ వార్నింగ్…
పోలీసు శాఖకు అప్రతిష్ట తెచ్చే సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకుంటామని, గలీజు పనులు చేస్తే ఊరుకునేది లేదని హైదరాబాద్ సీపీ సజ్జన్నార్ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మహంకాళి శిఖర పూజకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ఎంతపెద్ద అధికారి అయినా ఒదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్, మలక్ పేట, దోమల గూడ పోలీసులపై ఫిర్యాదులు వచ్చిన వెంటనే స్పెషల్ బ్రాంచి పోలీసులతో విచారణ జరిపి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణా రెడ్డి కేసులో సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు.
నామ మాత్రపు చర్యలతో దారికోస్తారా…
పోలీసుల ఇల్లీగల్ యవ్వారాలపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఉదయ్ వ్యవహారం అయితే దేశలో సంచలనం అయ్యింది. ఇది కొత్తగా జరుగుతున్న విషయాలు కావని, ఎప్పటి నుంచో జరుగుతున్నవేనని సీనియర్ సిటీజన్లు చెబుతున్నారు. ఏదైనా ఫిర్యాదులు వచ్చనప్పుడు నామ మాత్రంగా చర్యలు తీసుకుంటున్నారని, బదిలీ చేయడం, వీఆర్ కు పంపించడం వంటి చర్యలు పెద్దగా ప్రభావం చూపడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సస్పెండ్ చేయడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని,పోలీసు ఉన్నతధికారులు ఆ దిశగా ఆలోచన చేయాలని మహిళా సంఘాలు కోరుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates

