మొత్తానికి ఉత్కంఠకు తెరపడింది. కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన రెండేళ్లకే ఎన్నికల్లో అద్భుత ఫలితాలు రాబట్టిన తమిళ స్టార్ హీరో విజయ్.. తమిళనాడు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చున్నాడు. ఈ రోజు చెన్నైలోని నెహ్రూ స్టేడియంలో తన చేత గవర్నర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించాడు.
విజయ్ ఒక్క పిలుపునిస్తే లక్షల మంది అభిమానులు ప్రమాణ స్వీకారానికి తరలివచ్చేవారు కానీ.. వారిని అదుపు చేయడం కష్టమని స్టేడియంలో పరిమిత సంఖ్యలో అతిథులు, అభిమానుల మధ్య ప్రమాణ స్వీకార వేడుకను ముగించారు.
కానీ కోట్లమంది టీవీల్లో తమ అభిమాన నటుడు, నాయకుడి ప్రమాణ స్వీకారాన్ని చూసి పులకించిపోయారు. ఇక ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణ మాత్రం త్రిషనే అనడంలో సందేహం లేదు. విజయ్‌తో అధికారికంగా ఏ బంధం లేకపోయినా సరే.. ఆమెకు ఈ వేడుకలో ముందు వరుసలో సీటు దక్కడం విశేషం.
విజయ్ తల్లిదండ్రులు చంద్రశేఖర్, శోభతో పాటు మరి కొంతమంది ముఖ్య అతిథులకు మాత్రమే తొలి వరుసలో సీటు దక్కింది. త్రిషకు కూడా అక్కడే సీటు ఇవ్వడాన్ని బట్టి ఆమెకు ఎంత ప్రాధాన్యం దక్కిందన్నది అర్థం చేసుకోవచ్చు. విశేషం ఏంటంటే.. త్రిషతో పాటు ఆమె తల్లి సైతం ఈ వేడుకకు హాజరైంది. ఇది మరింతగా చర్చనీయాంశం అయింది.
త్రిష జస్ట్ వచ్చి సీటులో కూర్చోవడం కాకుండా.. స్టేడియంలో ఉన్న అభిమానులందరికీ చేయి ఊపుతో అభివాదం కూడా చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ వేడుకలో త్రిషకు దక్కిన ప్రాధాన్యం, ఆమె వ్యవహరించిన తీరు.. భవిష్యత్తుపై అందరికీ ఒక అంచనా వచ్చేలా చేసింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates