Political News

అనంతబాబు అరెస్టు… తర్వాతేంటి?

వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. రాజమహేంద్రవరంలోని కోర్టు విచారణకు హాజరై తిరిగి వెళుతున్న సమయంలో అనంతబాబును సర్పవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అనంతబాబును అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించిన పోలీసులు ఆయనను సర్పవరం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతబాబు అరెస్టు సమయంలో ఆయన వెంట ఆయన సతీమణి లక్ష్మీదుర్గ కూడా ఉన్నారు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న అనంతబాబు అరెస్టు కావడంతో ఆపై పోలీసులు ఏం చర్యలు తీసుకుంటారన్న దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.

వైసీపీ అధికారంలో ఉండగా… తన వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం అనే యువకుడిని హత్య చేయించినట్టు ఆరోపణలు ఎదుర్కున్న అనంతబాబు… డెడ్ బాడీని బాధితుడి ఇంటి వద్ద డెలివరీ చేసి వార్తల్లోకెక్కారు. ఈ కేసులో అరెస్టు అయిన అనంతబాబు ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. అయితే ఈ కేసును పూర్తిగా కొట్టివేయించుకునే దిశగా అడుగులు వేసిన అనంతబాబు… కేసులో ప్రధాన సాక్షులుగా ఉన్న నలుగురు వ్యక్తులను కిడ్నాప్ చేసి తనకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా తనకు అనుకూలంగా సాక్ష్యం చెబితే డబ్బు కూడా ఇస్తానని ఆయన బేరానికి దిగారు.

సాక్షులను బెదిరించిన వైనంపై సమాచారం అందుకున్న పోలీసులు సాక్షులను నిర్బంధించిన ప్రదేశానికి వెళ్లగా… కారుతో పాటు సర్కారు తనకు కేటాయించిన గన్ మెన్లను అక్కడే వదిలేసి అనంతబాబు పరారయ్యారు. ఈ సందర్భంగా బైక్ పై పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న అనంతబాబు… కోర్టుకు రాక తప్పలేదు. బెయిల్ షరతులను తుంగలో తొక్కుతూ సాక్షులను ప్రభావితం చేశారన్న ఆరోపణలను చూపిస్తూ అనంతబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విచారణకు రాకుంటే అనంతబాబు బెయిల్ దానికదే రద్దు అయిపోతుంది. ఈ నేపథ్యంలో పరారీలో ఉన్నప్పటికీ అనంతబాబు కోర్టు విచారణకు రాక తప్పలేదు. కోర్టు విచారణ ముగించుకుని బయటకు వచ్చిన అనంతబాబును పోలీసులు కోర్టు ప్రాంగణంలోనే అదుపులోకి తీసుకున్నారు. అనంతబాబు అరెస్టుతో ఇక ఆయనకు శిక్ష పడటం ఖాయమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే… అనంతబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనని చెప్పక తప్పదు.

This post was last modified on April 24, 2026 3:27 pm

Share

Recent Posts

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

6 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

8 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

8 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

9 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

9 hours ago

రెస్పాన్స్ విషయంలో బన్నీని మెచ్చుకోవాలి

రెండు మూడు రోజుల నుంచి అల్లు అర్జున్ - లోకేష్ కనగరాజ్ సినిమా క్యాన్సిల్ కావొచ్చనే వార్త ఫిలిం నగర్…

10 hours ago