Movie News

రామాయ‌ణం సినిమాను బ్యాన్ చేయండి… వీహెచ్‌పీ డిమాండ్‌

గ‌త రెండు వారాలుగా వ‌ర‌ల్డ్ వైడ్ బాక్సాఫీస్‌పై దండ‌యాత్ర చేస్తోంది రామాయ‌ణం సినిమా. ద‌క్షిణాదిన రెండో వీకెండ్ వ‌ర‌కు మంచి వ‌సూళ్లు సాధించి, ఆ త‌ర్వాత చ‌ల్ల‌బ‌డింది కానీ.. ఉత్త‌రాదిన‌, అలాగే విదేశాల్లో ఇప్ప‌టికీ మంచి క‌లెక్ష‌న్లు రాబ‌డుతోందీ చిత్రం. ఇలా మంచి ర‌న్‌తో న‌డుస్తున్న సినిమాకు ఇప్పుడు పెద్ద షాక్ త‌గిలింది. విశ్వ హిందూ ప‌రిష‌త్ (వీహెచ్‌పీ) ఈ సినిమాను తీవ్రంగా వ్య‌తిరేకించడం సంచ‌ల‌నం రేపుతోంది. థియేట‌ర్ల‌లో రామాయ‌ణం సినిమా ప్ర‌ద‌ర్శ‌న ఆపేయాల‌ని.. ఈ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ కూడా ర‌ద్దు చేయాల‌ని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తోంది.

హిందూ సంస్కృతి కోసం పాటుప‌డే వీహెచ్‌పీ.. రామాయ‌ణం లాంటి గొప్ప హిందూ పురాణ గాథ ఆధారంగా తీసిన సినిమాకు వ్య‌తిరేకంగా వ్యాఖ్య‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. ఐతే వాల్మీకి ర‌చించిన అస‌లు రామాయ‌ణాన్ని వ‌క్రీక‌రించి ఈ సినిమా తీశార‌న్న‌ది ఆ సంస్థ అభ్యంత‌రం. వాల్మీకి రామాయ‌ణానికి భిన్నంగా సినిమాలో ఏడు ఎపిసోడ్లు ఉన్న‌ట్లుగా వీహెచ్‌పీ ఆరోపిస్తోంది.

ముఖ్యంగా సినిమాలో రాముడి పాత్ర‌ను త‌క్కువ చేసి చూపించార‌ని.. అస‌లు క‌థ‌లో లేని విష‌యాల‌ను ఈ పాత్ర‌కు ఆపాదించార‌ని.. రావ‌ణుడి పాత్ర‌ను ఉన్న దాని కంటే గొప్ప‌గా ప్రెజెంట్ చేశార‌ని, రావ‌ణుడిని ఎలివేట్ చేయ‌డానికే ఈ సినిమా తీసిన‌ట్లు ఉంద‌ని.. ఇలా వీహెచ్‌పీ అనేక అభ్యంత‌రాలు లేవ‌నెత్తింది. 

వెంట‌నే సెన్సార్ స‌ర్టిఫికెట్ ర‌ద్దు చేసి రామాయ‌ణం ప్ర‌ద‌ర్శ‌న నిలిపివేయాల‌ని వీహెచ్‌పీ డిమండ్ చేస్తున్న నేప‌థ్యంలో ఏం జ‌రుగుతుందో చూడాలి. వీహెచ్‌పీ లాంటి సంస్థ నుంచి ఇలాంటి డిమాండ్ రావ‌డం రామాయ‌ణం మేక‌ర్స్‌కు పెద్ద షాక్ అన‌డంలో సందేహం లేదు. సీతారాములుగా సాయిప‌ల్ల‌వి, ర‌ణ‌బీర్ క‌పూర్‌, రావ‌ణుడిగా య‌శ్ న‌టించిన రామాయ‌ణం చిత్రాన్ని నితీశ్ తివారి రూపొందించాడు. న‌మిత్ మ‌ల్హోత్రా నిర్మించిన ఈ మూవీ ఇప్ప‌టిదాకా వ‌ర‌ల్డ్ వైడ్ రూ.1500 కోట్ల‌కు పైగా గ్రాస్ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టింది.

This post was last modified on November 22, 2026 11:06 am

Share

Recent Posts

డిగ్రీల కంటే చేతి వృత్తులకే విలువ ఎక్కువ – ప్రధాని మోదీ

డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…

30 minutes ago

శర్వానంద్‌కి ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది

కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…

3 hours ago

ఆ పాటకు 40 నిమిషాలు… ఈ పాటకు 19 నెలలు

తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…

3 hours ago

అనుమానాలు తీర్చేసిన వృషకర్మ

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…

4 hours ago

దుల్కర్ సల్మాన్… ఏమిటీ విచిత్రం?

కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…

4 hours ago

సుడిగాలి సుధీర్‌పై 15 కోట్లా?

‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…

4 hours ago