గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. టాలీవుడ్లో మరో పేరున్న సినిమా వాయిదా పడిపోయింది. ఈ నెల 27కు షెడ్యూల్ అయిన చిత్రాల్లో ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ మూవీ ‘హైందవ’ వాయిదా పడగా.. ఇప్పుడు అదే వీకెండ్‌లో రావాల్సిన రష్మిక మందన్నా చిత్రం ‘మైసా’ కూడా వెనక్కి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని, ప్రేక్షకులకు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే ‘మైసా’ను వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
తెలుగు సినిమా ప్రమాణాలు అంతకంతకూ పెరుగుతున్నాయని.. ఈ వారం విడుదలైన సినిమాలు కూడా సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలను నెలకొల్పాయని.. మైసా కూడా టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్ ఉన్న సినిమా అని, ఇందులో ప్రపంచ స్థాయి యాక్షన్ ఘట్టాలు ఉన్నాయని.. బిగ్ స్క్రీన్ ఆడియన్స్‌కు బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వాలన్న లక్ష్యంతో తాము ఈ సినిమాను రూపొందించామని.. అలాంటపుడు క్వాలిటీ విషయంలో ఎంతమాత్రం రాజీపడకుండా బెస్ట్ ప్రాడక్ట్ ఇవ్వాలన్న ఉద్దేశంతోనే తమ టీమంతా ఉమ్మడిగా సినిమాను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు ‘మైసా’ మేకర్స్ ప్రకటించారు.
త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని.. అంత వరకు ఓపికతో ఉండి తమకు సహకరించాలని కోరారు. ‘హైందవ’తో పాటు ‘మైసా’ కూడా వాయిదా పడడం ‘భోగి’కి వరం లాంటిదే. ఆ సినిమా కూడా పలుమార్లు వాయిదా పడి నవంబరు 27కు షెడ్యూల్ అయింది. దీనికి పోటీగా ‘హై’తో పాటు కొన్ని చిన్న సినిమాలు వస్తున్నప్పటికీ.. ‘భోగి’ దాదాపు సోలోగా రిలీజవుతున్నట్లే. మరి ఈ అవకాశాన్ని శర్వా అండ్ టీం ఎంతమేర ఉపయోగించుకుంటుందో చూడాలి.
This post was last modified on November 22, 2026 1:11 pm
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…
‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…
మనుషులు చేసే పనులను యంత్రాలు కూడా చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా కార్లలో వస్తున్న స్మార్ట్ టెక్నాలజీ డ్రైవింగ్ అనుభవాన్నే మార్చేస్తోంది. ఒకప్పుడు…
గత రెండు వారాలుగా వరల్డ్ వైడ్ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తోంది రామాయణం సినిమా. దక్షిణాదిన రెండో వీకెండ్ వరకు మంచి…
గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ నుంచి ఒక కొత్త సినిమా థియేటర్లలోకి రావాలంటే అభిమానులు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. 'ఆర్ఆర్ఆర్'…