‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి సుధీర్. అతను చేసే వేరే షోలు కూడా బాగానే పాపులర్ అయ్యాయి. బుల్లితెరపై అతడిని సూపర్ స్టార్ అనొచ్చు. ఐతే ఈ ఫాలోయింగ్ చూసి వెండితెర మీదా వెలిగిపోవాలని అతను చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు. హీరోగా ‘సాఫ్ట్‌వేర్ సుధీర్’, ‘గాలోడు’ లాంటి చిత్రాల్లో నటించాడు. కానీ అవేవీ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. అయినా సుధీర్ తన ప్రయత్నాలను ఆపలేదు.
కొన్నేళ్ల ముందు ‘గోట్’ అనే సినిమాను సుధీర్ మొదలుపెడితే.. అది కొన్ని కారణాల వల్ల ఎంతకీ పూర్తి కాలేదు. మొదట ‘పాగల్’ మూవీ డైరెక్టర్ నరేష్ కుప్పిలి దర్శకత్వంలో మొదలైన ఈ చిత్రాన్ని.. మధ్యలో వేదవ్యాస్ వేరే డైరెక్టర్ టేకప్ చేశాడు. అయినా సినిమా ఎంతకీ బయటికి రాలేకపోవడం, సుధీర్ సైతం ఈ చిత్రాన్ని పక్కన పెట్టేయడంతో ఇది ఇక రిలీజ్ కాదనుకున్నారు. కానీ నిర్మాత గట్టిగా ట్రై చేసి ఇటీవలే ఈ చిత్రాన్ని రిలీజ్ చేసుకోగలిగాడు.
కానీ ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కనీస ప్రభావం కూడా చూపించకుండానే మాయమైపోయింది. ఐతే ‘గోట్’ రిలీజ్ తర్వాత ఇంటర్వ్యూలు ఇస్తున్న నిర్మాత చంద్రశేఖర్.. ఈ సినిమా గురించి సంచలన విషయం చెప్పాడు. ఈ చిత్రానికి వడ్డీలు కాకుండా రూ.14.5 కోట్ల బడ్జెట్ అయిందని ఆయన వెల్లడించడం గమనార్హం. ఇంట్రెస్ట్స్ కూడా కలిపితే ఖర్చు ఇంకెంత అయిందో మరి. ఈ సినిమా వల్ల తాను దారుణంగా నష్టపోయినట్లు చంద్రశేఖర్ తెలిపాడు.
ముందు మూడున్నర కోట్ల బడ్జెట్లో సినిమా పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకుని రంగంలోకి దిగామని, ఐతే ఒక 25 శాతం ఖర్చు పెరగడం ఏ సినిమాకైనా కామనే అని.. కానీ ప్రొఫెషనలిజం లేని, ఫిలిం మేకింగ్ తెలియని దర్శకుడిని పెట్టుకుని సినిమా మొదలుపెట్టడం.. అవినీతి జరగడం, కమీషన్ల వల్ల సినిమా బడ్జెట్ అదుపు తప్పిందని, దర్శకుడిని మార్చినప్పటికీ బడ్జెట్ అదుపు చేయలేకపోయామని.. సినిమాలో కొందరు ఆర్టిస్టులు, టెక్నీషియన్లు బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డారని.. దీంతో బడ్జెట్ ఎక్కడికో వెళ్లిపోయిందని ఈ నిర్మాత తెలిపాడు.
సినిమా బడ్జెట్ పెరుగుతుంటే.. తన మీద ఇంత ఖర్చా అని సుధీర్ కొంచెం కంగారు పడ్డాడని, కానీ అతను కూడా తనకు పెద్దగా సహకరించలేదని, ఆదుకోలేదని.. హీరో లేకుండా సినిమాలో 60 శాతం దాకా షూట్ చేశామని చంద్రశేఖర్ చెప్పాడు.
This post was last modified on November 22, 2026 12:55 pm
కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…
తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…
మనుషులు చేసే పనులను యంత్రాలు కూడా చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా కార్లలో వస్తున్న స్మార్ట్ టెక్నాలజీ డ్రైవింగ్ అనుభవాన్నే మార్చేస్తోంది. ఒకప్పుడు…
గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. టాలీవుడ్లో మరో పేరున్న సినిమా వాయిదా పడిపోయింది. ఈ…