Political News

రాజ‌గోపాల్ జీ.. ఇలా అయితే ఎలా: కాంగ్రెస్‌ అధిష్టానం త‌లంటు?

కాంగ్రెస్ నేత‌, మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డికి పార్టీ అధిష్టానం త‌లంటిందా? ఇలా అయితే ఎలా? అంటూ ఆయ‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. గ‌త‌కొన్నాళ్లుగా మంత్రివ‌ర్గంలో చోటు కోసం రాజ‌గోపాల్ ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే.. ఇప్ప‌టికే ఆయ‌న సోద‌రుడు వెంక‌ట‌రెడ్డి మంత్రిగా ఉన్న నేప‌థ్యంలో ఒకే కుటుంబంలోని వారికి రెండు ప‌ద‌వులు ఇచ్చేది లేద‌న్న‌న‌ట్టుగా పార్టీ ఉంది. అయితే.. దీనికి సీఎం రేవంత్ రెడ్డే అడ్డుప‌డుతున్నార‌న్న‌ది రాజ‌గోపాల్ అంత‌ర్మ‌థ‌నం. దీంతో త‌ర‌చుగా సీఎంను కార్న‌ర్ చేస్తూ.. విమ‌ర్శ‌లు చేస్తున్నారు. గ‌త రెండు రోజులుగా మ‌రింత దూకుడు పెంచారు.

ఈ క్ర‌మంలో పార్టీ వ్య‌వ‌హారాల ఇంచార్జ్ ముందు హాజ‌రు కావాలంటూ.. అధిష్టానం రాజ‌గోపాల్‌ను ఆదేశించ‌డం చ‌ర్చ‌కు దారితీసింది. అయితే.. అధిష్టానం ఆదేశాల‌కు అనుగుణంగా రాజ‌గోపాల్ ఇంచార్జ్‌ను క‌లుస్తారా? లేక‌.. ఏం చేస్తారు? అనేది ఆస‌క్తిగా మార‌డం గ‌మ‌నార్హం. గ‌త ప్ర‌స్తుత ప‌నితీరును గ‌మ‌నిస్తే.. రాజ‌గోపాల్ తీవ్ర‌స్థాయిలో సీఎం రేవంత్‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. రెండు రోజుల కింద‌ట‌ మునుగోడులో జరిగిన కార్యక్రమంలో రేవంత్ రెడ్డి కేవలం త‌న‌ సొంత నియోజకవర్గాలకే వేల కోట్ల రూపాయల నిధులు త‌ర‌లించుకున్నార‌ని ఆరోపించారు. కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు, రూ 20 వేల కోట్లు ఇచ్చుకున్నా తమకు అభ్యంతరం లేదని, కానీ ఫ్లోరైడ్ పీడిత ప్రాంతమైన మునుగోడుకు కనీసం రూ.500 కోట్లు కూడా ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.

నిధులు లేక డిండి ఎత్తిపోతల పథకం, చౌటుప్పల్‌లో 100 పడకల ఆసుపత్రి, రోడ్ల పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయని రాజ‌గోపాల్ విమర్శించారు. మునుగోడుకు నిధులు ఆపితే మరో “కురుక్షేత్రం” తప్పదని ఆయన హెచ్చరించారు. అంతేకాదు.. సీఎంను నేరుగా విమ‌ర్శించారు. నిధులపై ప్రశ్నిస్తే ‘పండబెట్టి తొక్కుతా’ అని సీఎం అనడం తనను తీవ్రంగా బాధించిందని రాజగోపాల్ రెడ్డి అన్నారు. “అదృష్టం కొద్దీ ముఖ్యమంత్రి అయ్యారు.. కనీసం మిగిలిన రెండేళ్లయినా ప్రజలను పట్టించుకోండి” అని నేరుగా విమ‌ర్శించారు. అంతేకాదు,

అక్క‌డితో కూడా ఆగ‌కుండా.. సిద్దిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గా, “మూడేళ్ల నుంచి రేవంత్ రెడ్డి మెంటల్ కండిషన్ బాగాలేదు, అధికార అహంకారంతో కళ్లు నెత్తికెక్కాయి” అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తానే పదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉంటానని రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని, ముఖ్యమంత్రిని అధిష్టానం నిర్ణయిస్తుందని రాజ‌గోపాల్ వ్యాఖ్యానించారు.

ఈ వ్య‌వ‌హారంపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వీడియో క్లిప్పింగ్‌లతో కూడిన నివేదికను అధిష్టానానికి పంపారు. ఈ క్ర‌మంలోనే పార్టీ అధిష్టానం రాజ్‌గోపాల్ వ్య‌వ‌హారాన్ని సీరియ‌స్‌గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.

This post was last modified on November 21, 2026 11:34 pm

Share

Recent Posts

తండ్రిపై కొడుకు విజ‌యం

ఒక సూప‌ర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వ‌చ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంత‌గా వాడుకోవ‌డానికే ప్ర‌య‌త్నిస్తాడు. న‌ట‌న‌లో తండ్రిని అనుక‌రించ‌డం.. త‌న…

5 hours ago

మోడీని బ్లాక్‌మెయిల్ చేయ‌లేను: కేంద్రంపై బాబు

కేంద్ర ప్ర‌భుత్వానికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న మాట వాస్త‌వ‌మేన‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…

6 hours ago

జ‌గ‌న్ గురించి ఆ రాత్రి బాగా ఆలోచించా: చంద్ర‌బాబు

వైసీపీ అధినేత జ‌గ‌న్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించ‌లేద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే త‌ప్ప‌.. ఎప్పుడూ ఆయ‌న…

6 hours ago

ఫెయిర్‌నెస్ క్రీమ్ వల్ల కిడ్నీ దెబ్బతిందా?

అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…

7 hours ago

సీత చేసిన లోటు నిత్యారెడ్డితో ఔటు

రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…

7 hours ago

మైసా ఎంట్రీతో మరింత చిక్కుముడి

వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…

8 hours ago