కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు. అక్కడ ఎంత వినూత్నమైన కథలు వస్తాయో.. ఎంత బిగితో సినిమాలు తీస్తారో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. తక్కువ బడ్జెట్లోనే అద్భుతమైన కంటెంట్‌తో సినిమాలు తీయడంలో మలయాళ ఫిలిం మేకర్స్ నైపుణ్యమే వేరు. మలయాళంలో వచ్చే వైవిధ్యమైన, క్వాలిటీ సినిమాలను ఓటీటీల్లో చూసి.. ఇలాంటి చిత్రాలు మన వాళ్లెందుకు తీయట్లేదు అని ఆవేదన చెందుతుంటారు తెలుగు ప్రేక్షకులు.
కానీ అంత పేరున్న ఇండస్ట్రీ ఒక హీరోను సరిగా ఉపయోగించుకోలేకపోతుండడం.. ఆ హీరో తెలుగులో వచ్చి అద్భుతమైన సినిమాలు చేస్తుండడమే విచిత్రం. ఈ హీరో దుల్కర్ సల్మాన్ అని ఈ పాటికే అర్థమైపోయి ఉంటుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి తనయుడైన దుల్కర్ తన మాతృభాషలో చాలా త్వరగా స్టార్ ఇమేజ్ సంపాదించాడు.
తండ్రిని ఏ విషయంలోనూ అనుకరించకుండా, ఆయన పేరు వాడుకోకుండా ఉస్తాద్ హోటల్, బెంగళూరు డేస్, చార్లి సహా ఎన్నో అద్భుతమైన సినిమాలు చేసి పెద్ద స్టార్‌గా ఎదిగాడు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఇతర భాషల్లో సినిమాలు చేయడం మొదలుపెట్టి అక్కడ మంచి పేరు సంపాదించాక తన మాతృభాషలో అతడికి సరైన సినిమాలే రావట్లేదు.
ముఖ్యంగా తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి అద్బుతమైన సినిమాలు చేసి వావ్ అనిపించాడు దుల్కర్. తెలుగులో తెలుగు స్టార్లకు కూడా ఇలాంటి సినిమాలు రావడం అరుదు. కానీ దుల్కర్‌తో మాత్రం మన ఫిలిం మేకర్స్ గొప్ప సినిమాలు తీశారు. ఇప్పుడు దుల్కర్ చేసిన కొత్త తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ కూడా ఈ లిస్టులోకి చేరింది. దాన్ని కూడా అందరూ గొప్ప సినిమా అని కొనియాడుతున్నారు. కానీ మలయాళంలో మాత్రం దుల్కర్‌కు ఓ మంచి సినిమా పడి చాలా కాలమైపోయింది.
కొన్ని నెలల ముందే ‘ఐమ్ గేమ్’ అనే సినిమా వచ్చింది. అది ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. డిజాస్టర్ అయింది. కొన్నేళ్ల ముందు ‘కింగ్ ఆఫ్ కోతా’ అనే భారీ సినిమా చేశాడు. అదీ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఇంకా గత కొన్నేళ్లలో దుల్కర్ నటించిన ఏ మలయాళ సినిమా ఆకట్టుకోలేదు. మామూలుగా మలయాళంటే క్వాలిటీ సినిమాలకు పెట్టింది పేరు. వాటి మీద తెలుగు చిత్రాలు విషయం, వైవిధ్యం పరంగా వీక్‌గా కనిపిస్తాయి. కానీ దుల్కర్ మాత్రం తెలుగులో గొప్ప సినిమాలు చేస్తూ సొంత భాషలో మాత్రం సరైన సినిమాలు చేయలేక ఇబ్బంది పడుతుండడం అనూహ్యం.
This post was last modified on November 22, 2026 8:15 am
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అపరిచిత భక్తుడు భారీ కానుక సమర్పించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…
డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…
కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…
తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…