Movie News

అనుమానాలు తీర్చేసిన వృషకర్మ

డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఎందుకంటే ప్యాన్ ఇండియా సినిమాలకు ఇది చాలా మంచి డేట్. గతంలో అఖండ, పుష్ప 2 లాంటివి ఈ తేదీకి వచ్చి అద్భుత వసూళ్లు సాధించాయి. అందులోనూ బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరో కంటెంట్ లేకపోవడం కొంత వెలితిగా ఉంది. ఇలాంటి టైంలో చైతు మూవీ కనక మెప్పిస్తే హిట్టుతో పాటు భారీ మొత్తంలో కలెక్షన్లు వచ్చి పడతాయి.

ఇన్ని ఆశలు పెట్టుకున్న టైంలో పోస్ట్ పోన్ అంటే ఎవరికైనా ఖంగారే. అయితే వాళ్ళు టెన్షన్ పడాల్సిన పని లేదు. వృషకర్మ ముందు చెప్పినట్టే డిసెంబర్ నాలుగునే వస్తుందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అంతర్గత వర్గాల ప్రకారం రేపు సెన్సార్ జరగనుంది. తర్వాత అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పుడు మొదలుపెట్టాలనేది నిర్ణయించుకుంటారు. కార్తీక్ దండు దర్శకత్వం వహించిన ఈ మిస్టిక్ థ్రిల్లర్ లో మీనాక్షి చౌదరి హీరోయిన్ కాగా అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చారు.

ఇది కేవలం ఫ్యాన్స్ కే కాదు ట్రేడ్ వర్గాలకు పెద్ద రిలీఫ్ లాంటి వార్త. ఎందుకంటే అప్పటికంతా ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఆకాశంలో ఒక తార బాగా నెమ్మదించి ఉంటాయి. ఈ వీకెండ్ తర్వాత ఓమ్ కూడా మేజిక్ చేయలేకపోవచ్చు. వచ్చే వారం శర్వానంద్ భోగికి వచ్చే టాక్ ని బట్టి దాని ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది అంచనా వేయొచ్చు. రష్మిక మందన్న మైసా తప్పుకుంది కాబట్టి ఇంకొంచెం స్పేస్ దొరికినట్టయ్యింది. అలాని వృషకర్మకు అసలు కాంపిటీషన్ లేదని కాదు.

నితిన్ అలియాస్ రుక్మిణి మీద బజ్ పెరుగుతోంది. నిర్మాతగా నాని పబ్లిసిటీ విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటున్నాడు. రెండు వేర్వేరు జానర్లు కాబట్టి టెన్షన్ పడాల్సింది ఏమి లేదు. అయితే తండేల్ తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ తెచ్చుకున్న నాగచైతన్య ఈసారి యునానిమస్ గా జనాన్ని మెప్పించాల్సి ఉంటుంది. బడ్జెట్ భారీగానే ఖర్చు పెట్టారు. విజువల్స్, సెట్స్ అన్నీ టాప్ స్టాండర్డ్ లో ఉన్నాయి. నిధుల అన్వేషకుడిగా నాగ చైతన్య క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ తో ఉండబోతోంది.

This post was last modified on November 22, 2026 1:25 pm

Share

Recent Posts

శర్వానంద్‌కి ఓపెన్ గ్రౌండ్ దొరికేసింది

కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…

1 hour ago

ఆ పాటకు 40 నిమిషాలు… ఈ పాటకు 19 నెలలు

తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…

1 hour ago

దుల్కర్ సల్మాన్… ఏమిటీ విచిత్రం?

కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…

2 hours ago

సుడిగాలి సుధీర్‌పై 15 కోట్లా?

‘జబర్దస్త్’ కామెడీ షోలో ఎన్నో ఏళ్ల పాటు ఒక టీంను నడిపించడం ద్వారా మంచి ఫ్యాన్ ఫాలోయింగే సంపాదించాడు సుడిగాలి…

2 hours ago

రాత్రంతా పార్కింగ్ కష్టాలు.. 868 సార్లు ప్రయత్నించిన ఈవీ కారు

మనుషులు చేసే పనులను యంత్రాలు కూడా చేయగలుగుతున్నాయి. ముఖ్యంగా కార్లలో వస్తున్న స్మార్ట్ టెక్నాలజీ డ్రైవింగ్ అనుభవాన్నే మార్చేస్తోంది. ఒకప్పుడు…

3 hours ago

మైసా… చావు కబురు చల్లగా చెప్పారు

గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమే అని తేలిపోయింది. టాలీవుడ్లో మరో పేరున్న సినిమా వాయిదా పడిపోయింది. ఈ…

3 hours ago