వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన గురించి వ్యక్తిగతంగా తాను పట్టించుకోలేదన్నారు. కానీ, తొలిసారి.. నాలుగు రోజుల కిందట.. తాను జగన్ గురించి ఆలోచించానని చెప్పడం గమనార్హం. “అది కూడా జగన్ మానసిక స్థితిని గమనించి.. చాలా ఆందోళన వేసింది. అసలు ఏంటీ మనిషి.. ఇలా చేస్తున్నాడు.. అని అనిపించింది.“ అన్నారు. అంతేకాదు.. వైఎస్ కుటుంబంతోనూ తనకు అనుబంధం ఉందన్నారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి తాను ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చామని.. కొన్నాళ్లు కాంగ్రెస్లో పనిచేశామని.. ఆ తర్వాత ఎవరికి నచ్చిన దారిని వారు ఎంచుకున్నామని చెప్పారు. “ఎప్పుడైనా.. రాజశేఖరరెడ్డి కానీ, నేను కానీ.. సైద్ధాంతికంగానే పోరాడం తప్ప.. ఒకరిపై ఒకరు వెకిలి రాజకీయాలు చేసుకోలేదు. అసెంబ్లీలో ఆయన నన్ను తిట్టేవాడు. నేను ఆయనను అరిచేవాడిని. కానీ, బయటకు వచ్చాక.. పరస్పరం నవ్వుతూ.. కాఫీ తాగిన రోజులు గుర్తున్నాయి. నాపై తిరుపతిలో మావోయిస్టులు దాడి చేసినప్పుడు.. ఆయన పరుగు పరుగున హైదరాబాద్ నుంచి పలకరించేందుకు వచ్చారు. అదీ అనుబంధం“ అని తెలిపారు.
కానీ, జగన్ పరిస్థితి చూస్తే.. ఎంతసేపూ వ్యక్తిగత అంశాలు. అపార్థాలు నెత్తికి చుట్టడమే చేస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వారు అధికారంలో ఉన్నప్పుడు.. అసెంబ్లీలో నా సతీమణిని అనరాని మాటలు అన్నారు. కన్నీరు ఆపుకోలేకపోయాను. ఇప్పుడు ఏకంగా.. తోడబుట్టిన చెల్లెలు, ఒక జాతీయ పార్టీకి రాష్ట్రంలో అధ్యక్షురాలుగా ఉన్న షర్మిల మాయింటికి వచ్చి.. శుభలేఖ ఇస్తే.. దానికి వేరే పెడార్థాలు తీసి.. తన పత్రికలో రాయించాడు. ఇదే నన్ను ఆలోచించేలా చేసింది. అసలు ఇలాంటి పనికిమాలిన ఆలోచనలు కూడా వస్తాయా? అని అనిపించింది.“ అని తెలిపారు.
షర్మిల వివాహం హైదరాబాద్లో జరిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. అప్పట్లో తనకు వైఎస్ ఆహ్వానం ఇచ్చారని.. తాను కూడా వెళ్లినట్టు గుర్తు ఉందని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన సక్రమంగా ఉండాలన్నారు. ఎలా పడితే అలా.. సంబంధాలు అంటగట్టి.. ఇలానా రాసేది(జగన్ పత్రిక కథనాన్ని మీడియాకు చూపించారు) అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి వారిని ఏం చేయాలో ప్రజలే నిర్ణయించాలని సూచించారు. తాను వచ్చే 2028 నాటికి 50 ఏళ్ల రాజకీయ ప్రస్తానం పూర్తి చేసుకుంటున్నట్టు తెలిపారు. కానీ.. జగన్ లాంటి వారిని ఎప్పుడూ తాను చూడలేదన్నారు. ఎంతో మందితో పోరాడాను కానీ.. జగన్ లాంటి మనస్తత్వం ఉన్నవారిని చూడలేదు. అని వ్యాఖ్యానించారు.
This post was last modified on November 21, 2026 8:30 pm
ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన…
కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…