కేంద్ర ప్రభుత్వానికి తాము మద్దతు ఇస్తున్న మాట వాస్తవమేనని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారు. అయితే.. దీనిని అడ్డు పెట్టుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని బ్లాక్ మెయిల్ చేయాలని గొడ్డలి పార్టీ నాయకులు సలహా ఇస్తున్నారని.. గొంతెమ్మ కోరికలు కోరాలని చెబుతున్నారని విమర్శించారు. కానీ, తాను బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయలేనని.. తన సుదీర్థ రాజకీయ ప్రస్తానంలో ఎవరినీ బ్లాక్ మెయిల్ చేయడం.. తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కూడా అదే పంథాలో ముందుకుసాగుతానని అన్నారు.
“కేంద్రం ఏం తక్కువ చేసింది. గత ప్రభుత్వం కేంద్ర ప్రాయోజిత పథకాలకు నిధులు ఇవ్వకుండా మురగ పెడితే.. ఇప్పుడు వాటిని పునరుద్ధరించారు. దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకి వచ్చేలా ప్రధాని స్వయంగా చొరవ తీసుకుంటున్నారు. జల్ జీవన్ మిషన్ కింద గ్రామాలకు నీటి సౌకర్యం కల్పిస్తున్నారు. అమరావతి రాజధాని విషయంలో చేస్తున్న సాయం అందరికీ తెలిసిందే. ఇలాంటి ప్రభుత్వాన్ని, ప్రధాని మోడీని బ్లాక్ మెయిల్ చేయాలన్న ఆలోచన దుర్మార్గం. వాళ్లకి(వైసీపీ) అసలు ఈ ఆలోచనలు ఎలా వస్తాయో కూడా అర్ధం కాదు“ అని అన్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రం ఇప్పుడే కోలుకుంటోందని చెప్పారు. అన్ని విషయాల్లోనూ కేంద్రం నుంచి సంపూర్ణ సహకారం ఉందని చంద్రబాబు చెప్పారు. విశాఖలో డేటా కేంద్రం ఏర్పాటు చేస్తామంటే.. అనుమతి ఇచ్చారని గుర్తు చేశారు. అమరావతి రాజధానికి.. కేంద్ర ప్రభుత్వ సంస్థలను తీసుకువస్తున్నారని. ఉద్యోగులకు సంబంధించిన నివాసాల నిర్మాణాన్ని కూడా త్వరలోనే ప్రారంభించనున్నారని తెలిపారు. “రాజకీయంగా వారి సిద్ధాంతాలు వారికి ఉంటాయి. నా సిద్ధాంతాలు నాకుంటాయి. ఇరువురు కలిసి అభివృద్ధి కోసం.. చేతులు కలిపాం.“ అని తెలిపారు.
ఈ దేశానికి మోడీ బలమైన నాయకుడని తాను ఇప్పుడు చెప్పడం కాదని.. రికార్డులు ఉంటే చూసుకోవాలని చంద్రబాబు పరోక్షంగా వైసీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. 2014కు ముందే మోడీతో తనకు పరిచయం ఉందన్నారు. అప్పట్లోనే ఆయనను బలమైన నాయకుడిగా ప్రకటించానన్నారు. మధ్యలో విభేదాలు వచ్చిన మాట వాస్తవమేనని తెలిపారు. అయితే.. అది కూడా.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే తప్ప.. జైలు-బెయిల్ రాజకీయాల కోసం కాదని జగన్పై పరోక్షంగా నిప్పులు చెరిగారు. ఇలాంటి రాజకీయ నేతలు ఉన్నంత వరకు.. ఎవరికీ ప్రయోజనం ఉండదని చెప్పారు.
This post was last modified on November 21, 2026 11:52 pm
ఒక సూపర్ స్టార్ కొడుకు సినిమాల్లోకి వచ్చాడంటే.. తండ్రి పేరును వీలైనంతగా వాడుకోవడానికే ప్రయత్నిస్తాడు. నటనలో తండ్రిని అనుకరించడం.. తన…
వైసీపీ అధినేత జగన్ గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదని సీఎం చంద్రబాబు చెప్పారు. రాజకీయంగా పోరాటమే తప్ప.. ఎప్పుడూ ఆయన…
అందంగా కనిపించాలనే కోరికతో చాలామంది రకరకాల బ్యూటీ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తుంటారు. ముఖ్యంగా ముఖంపై మొటిమలు, మచ్చలు, పిగ్మెంటేషన్ తగ్గుతాయని చెప్పే…
రామాయణ పార్ట్ 1 వెయ్యి కోట్లకు పైగా వసూలు చేసినా సినిమాలో నటన పరంగా ఎక్కువ పేరు వచ్చింది యష్,…
వచ్చే వారం నవంబర్ 27 విడుదల కావాల్సిన మైసా వాయిదా పడి డిసెంబర్ 11 వెళ్లిపోయిందనే వార్త కొందరు ఆశ్చర్యంగా…
శ్రీసత్యసాయి జిల్లా పరిషత్ చైర్మన్గా.. శనివారం సీనియర్ నాయకుడు, దివంగత పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరాం ప్రమాణ స్వీకారం…