ప్రస్తుతం వైసీపీకి ఉన్న 11 నియోజకవర్గాల్లో వచ్చే ఎన్నికల నాటికి 4 నియోజకవర్గాలు చేజారి పోవడం ఖాయమని అంటున్నారు పరిశీలకులు. వాస్తవానికి గత ఎన్నికల్లో వైనాట్ 175 అంటూ బరిలో నిలిచిన వైసీపీకి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. కానీ.. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా.. ఆయా ఎమ్మెల్యేలు ప్రజల మధ్యకు రావడంలేదు. అసెంబ్లీకి పోవడం లేదు. సమస్యలు ఎక్కడివక్కడే అన్నట్టుగా కూడా ఉన్నాయి.
ఇది పార్టీకి ప్రధాన చిక్కుగా మారింది. అయితే.. ఈ 11 స్థానాల్లో కొందరు ఎమ్మెల్యే వ్యక్తిగతంగా పనులు చేసుకుంటున్నా.. కీలకమైన 4 నియోజకవర్గాల్లో మాత్రం.. పనులు ముందుకు సాగడం లేదు. ప్రజలు కూడా ఆగ్రహంతో ఉన్నారు దీంతో ఆయా స్థానాలు దక్కడం కష్టమనే వాదన వినిపిస్తోంది. వీటిలో ప్రధానంగా పుంగనూరు నియోజకవర్గం పేరు వినిపిస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి 2009 టు 2024 వరకు వరుసగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం దక్కించుకున్నారు.
కానీ.. గత ఎన్నికల్లో ఆయనకు అత్యంత తక్కువ మెజారిటీనే వచ్చింది. కేవలం 6 వేల ఓట్ల మెజారిటీతో నే ఆయన కుస్తీ పట్టి గెలుపు గుర్రం ఎక్కారు. ఇక్కడ పోటీ ఇప్పటి నుంచే ప్రారంభమైంది. బీసీవై నాయకుడు బోడే బలంగా పోరాడుతున్నారు. మరోవైపు పెద్దిరెడ్డి ప్రజలకు దూరమయ్యారు. వ్యాపారాలు, కేసులతో ఆయన తీరిక లేకుండా ఉన్నారు.
ఇక, 2) బద్వేల్. ఈ నియోజకవర్గం కడపలో ఉంది. కానీ.. ఓటమి దిశగా ఇక్కడ ఎమ్మెల్యే సుధ అడుగులు వేగంగా పడుతున్నాయట.
3) దర్శి: ఉమ్మడి ప్రకాశంలో అత్యంత తక్కువ మెజారిటీతో గత ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కిక వైసీపీ నేత బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు మైనస్‌లలో పడిపోయారని అంటున్నారు. మంత్రి గొట్టిపాటి రవి.. గత ఎన్నికల్లో పోటీ చేసిన గొట్టిపాటి లక్ష్మిలు.. దర్శిపై దృష్టి పెట్టారు. దీంతో బూచేపల్లి ఓటమి ఖాయమని అంటున్నారు.
4) అరకు.. గత ఎన్నికల్లో రేగం మత్స్యలింగం విజయం సాధించారు. కానీ, ఇక్కడ జనసేన దూకుడుగా ఉంది. దీనికి టీడీపీ కలిసి వస్తోంది.
ఫలితంగా వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఇక్కడ పరాజయం పాలవడం ఖాయమని అంటున్నారు. అయితే.. జగన్ పాదయాత్ర ప్రభావం ఉంటే ఈ నియోజకవర్గాల్లో ఛాన్స్ మిస్సయినా.. ఇతర నియోజకవర్గాల్లో విజయం దక్కించుకుంటామని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates