పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడింది. బయట అంచనాలు అందుకోలేకపోయినా టాలీవుడ్ బయ్యర్లు సేఫ్ అయ్యారు. తర్వాత మా ఇంటి బంగారం అదరగొట్టింది. ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టి బాక్సాఫీస్ కు కళ తీసుకొచ్చింది. తక్కువ బిజినెస్ చేయడం వల్ల డిస్ట్రిబ్యూటర్లు ఎక్కువ లాభాలు కళ్లజూశారు. ఇదే రూట్ లో వెళ్లిన లెనిన్ ఊహించిన దానికన్నా పెద్ద విజయం అఖిల్ కు కానుకగా ఇచ్చింది. హండ్రెడ్ క్రోర్ అందుకుంటుందా లేదానేది ఈ వీకెండ్ మీద ఆధారపడి ఉంటుంది.
ఇప్పుడు నెక్స్ట్ అందరి కళ్ళు చెన్నై లవ్ స్టోరీ మీదకు వెళ్తున్నాయి. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీ ప్రియా జంటగా రవి నంబూరి దర్శకత్వంలో రూపొందిన ఈ ఎమోషనల్ లవ్ స్టోరీకి, సాయిరాజేష్ రచన ప్లస్ పర్యవేక్షణ బేబీ స్థాయిలో మార్కెటింగ్ చేశాయి. ప్రమోషన్ల పరంగా టీమ్ ఎంత చేయాలో అంతా చేసింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని ఒప్పించి చీఫ్ గెస్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసింది. ఆయన రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలవడమే కాదు సోషల్ మీడియా అటెన్షన్ తీసుకొచ్చింది.
కంటెంట్ మీద నమ్మకంతో ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేస్తున్నారు. వాటిని కేవలం హైదరాబాద్ కు మాత్రమే పరిమితం చేయకుండా ఏపీ తెలంగాణ మెయిన్ సెంటర్స్ కు విస్తరించడం మంచి స్ట్రాటజీ. దాని వల్ల మీడియాతో పాటు కామన్ ఆడియన్స్ ఏమనుకుంటున్నారనేది అర్ధరాత్రే బయటికి వచ్చేస్తుంది. మూడు గంటల నిడివితో అంత బరువైన భావోద్వేగాలతో ఎలాంటి కథ చెప్పారనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంది. దాన్ని అందుకుంటే చాలు.
పోటీగా కూడా పెద్దగా ఏం లేదు. ఒకవేళ జన నాయకుడు కనక భగవంత్ కేసరి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ సబ్జెక్టు అయ్యుంటే వాయిదా ఆలోచన చేయాల్సి వచ్చేది కానీ ఇప్పుడా టెన్షన్ లేదు. చెన్నై లవ్ స్టోరీకి సంగీతంతో పాటు ఎమోషన్లు, ట్విస్టులు కీలకం కానున్నాయి. అవి కనక కనెక్ట్ అయితే కిరణ్ అబ్బవరంకు మరో హిట్టు ఖాతాలో పడినట్టే. ఇది విజయం సాధిస్తే మార్కెట్ పరంగా కిరణ్ కు ప్రమోషన్ అవుతుంది. ఇప్పటికే పలు అగ్ర నిర్మాణ సంస్థలు తనతో సినిమాలు ప్లాన్ చేసుకున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
