Political News

సాక్షి కార్టూన్… చంద్రబాబుకు ప్లస్ అయ్యిందా?

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో చంద్ర‌బాబు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారంటూ.. జ‌గ‌న్ సొంత మీడియాలో ఓ కార్టూన్ వ‌చ్చింది. కార్టూనిస్టు స్వేచ్ఛ‌ను ఎవ‌రూ హ‌రించ‌లేదు. నిర్బంధాలు కూడా పెట్ట‌లేరు. కానీ.. దీని వెనుక ఉన్న ఔచిత్యాన్ని మాత్రం ప్ర‌శ్నించ‌డంలో త‌ప్పులేదు. అమ‌రావతి నేమ్ బోర్డును ప‌ట్టుకున్న సీఎం చంద్ర‌బాబు.. ఒక‌సారి నెత్తిమీద‌, మ‌రోసారి కుడి వైపు.. ఇంకోసారి ఎడ‌మవైపు.. మ‌రోసారి.. త‌ల‌కిందు లుగా ప‌ట్టుకుని ఉన్న‌ట్టుగా ఈ కార్టూన్ గీశారు.

దీని అంత‌రార్థం.. చంద్ర‌బాబు అమ‌రావ‌తితో ఆడుకుంటున్నార‌ని.. ఆయ‌న పిల్లిమొగ్గ‌లు వేస్తున్నార‌ని చెప్ప‌డ‌మే. అంతేకాదు.. కార్టూన్‌కు ఇచ్చిన క్యాప్ష‌న్ కూడా ఇలానే ఉంది. అమ‌రావ‌తి రైతుతో చంద్ర‌బాబు మాట్లాడుతున్న‌ట్టుగా.. గీసిన ఈ కార్టూన్‌లో అమ‌రావ‌తి ఇప్ప‌ట్లో పూర్తికాద‌ని.. ఇదే ఆరంభ‌మ‌ని వ్యాఖ్యా నించిన‌ట్టు పేర్కొన్నారు. మొత్తంగా ఏపీ రాజ‌ధాని విష‌యంలో చంద్ర‌బాబు వైఖ‌రి ఇదీ అని చెప్పే ప్ర‌య‌త్నం అయితే జ‌రిగింది.

ఒకే.. ఆ విష‌యానికి వ‌చ్చినా..చంద్ర‌బాబు ఒకే మాట‌పై ఉంటున్నారు. 2014-19 మ‌ధ్య ఒక మాట‌.. పార్టీ ఓడిపోయిన త‌ర్వాత‌.. 2019-24 మ‌ధ్య మ‌రోమాట మాట్లాడ‌లేదు. ఆది నుంచి అమ‌రావ‌తినే ఆయ‌న రాజ‌ధాని అని చెబుతున్నారు. రైతుల త్యాగాల‌ను గుర్తించాల‌ని సూచిస్తున్నారు. దీనిలో ఎలాంటి తేడా లేదు. ఇక‌, ఇప్పుడు కూట‌మి హ‌యాంలో మ‌రింత విస్త‌రించాల‌ని భావిస్తున్నారు. అంటే.. త‌డ‌వ‌కోమాట ఆయ‌న చెప్ప‌క‌పోగా.. రాజ‌ధానిని విశాల ప్ర‌జాహితాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మిస్తున్నారు.

ఈ క్ర‌మంలో నిజంగానే చంద్ర‌బాబు అనేక క‌ష్టాలు పడుతున్నారు త‌ప్ప‌.. పిల్లి మొగ్గ‌లు కాదు. కానీ.. అదే వైసీపీని తీసుకుంటే.. ముందు అమ‌రావ‌తికి అనుకూలంగా ఉన్నామ‌ని 2014-19 మ‌ధ్య విప‌క్షంలో ఉన్న‌ప్పుడు చెప్పారు. అధికారంలోకి వ‌చ్చాక మూడు రాజ‌ధానులు అన్నారు. ఇక‌, ఇప్పుడు అధికారం పోయాక‌..

మావిగన్‌(మ‌చిలీప‌ట్నం+విజ‌య‌వాడ‌+గుంటూరు)ను ప్ర‌తిపాదించారు. సో.. దీనిని బ‌ట్టి ఎవ‌రు పిల్లిమొగ్గ‌లు వేస్తున్నారో.. ఎవ‌రు రాజ‌ధానిపై ఒక నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారో అర్ధ‌మ‌వుతోంద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ కార్టూన్ ఒక విధంగా చంద్రబాబుకు కలిసొచ్చేదే అంటూ నాయకులు చెబుతున్నారు.

This post was last modified on April 5, 2026 4:31 pm

Share

Recent Posts

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు…

7 hours ago

పుష్ప విలన్ ‘ట్రబుల్’ కొత్తగా ఉందే

ఒక మీడియం బడ్జెట్ సినిమాకు రాజమౌళి ప్రెజెంట్స్ అని పడిందంటే అందులో విషయం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకంటే…

8 hours ago

జపాన్ ఓడినా టీమిండియా గెలవలేదు…

జపాన్‌పై రెండు పరుగుల తేడాతో గెలిచారు. కానీ ఈ మ్యాచ్ తర్వాత టీమిండియా బ్యాటింగ్‌పై మళ్ళీ సందేహాలు మొదలయ్యాయి. భారత…

8 hours ago

గిన్నిస్ బుక్కంటే క్రేజ్ తగ్గిందనుకోవాలా

ఒకప్పుడు గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డులో పేరు సంపాదించుకోవడమంటే అదో పెద్ద ఘనతగా భావించే వాళ్ళు. పెద్ద పెద్ద…

9 hours ago

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

11 hours ago

ఆలస్యం జరిగింది ఇక ఆగడం ఉండదు

టాలీవుడ్ సినిమాలకు అదేం శాపమో అర్థం కాదు కానీ కొన్నింటికి ప్రభుత్వాల నుంచి జిఓలు సకాలంలో రావు, చివరి నిమిషం…

12 hours ago