Political News

‘అమరావతికి’ ఎమ్మెల్యే… సాధ్యపడుతుందా?

ఏపీలో కొత్త‌గా ఏర్ప‌డే నియోజ‌క‌వ‌ర్గాల సంఖ్య దాదాపు 88 వ‌ర‌కు ఉంటుంద‌న్న చ‌ర్చ న‌డుస్తోంది. రాష్ట్రాల వారిగా ఇటీవ‌ల కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా చెప్పిన లెక్క‌ల ప్ర‌కారం.. స‌గం నియోజ‌క‌వ‌ర్గాలు పెర‌గ‌నున్నాయి. దీంతో ఏపీలో ప్ర‌స్తుతం ఉన్న 175 స్థానాలు.. ఏకంగా 263 కు చేర‌నున్నాయి. స‌రే.. పెరిగేవి.. త‌రిగేవి ఎలా ఉన్నా.. కొన్ని కొన్ని కీల‌క ప్రాంతాల‌పై త‌న‌దైన ముద్ర వేసేలా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ప్ర‌య‌త్నిస్తున్నారు.

గ‌తంలో 1997లో  ఆయ‌న పాల‌న చేసిన‌ప్పుడు.. `జ‌న్మ‌భూమి` వంటి  కీల‌క కార్య‌క్ర‌మాల‌కు శ్రీకారం చుట్టారు. అదేవిధంగా `శ్ర‌మ‌దానం` వంటివి కూడా చేప‌ట్టి.. స‌మాజంలో మార్పు తెచ్చేదిశ‌గా ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలోనే జ‌న్మ‌భూమి పేరును చిర‌స్థాయిగా ప్ర‌జ‌లు గుర్తుంచుకునేలా.. అప్ప‌టి కేంద్రంతో మాట్లాడి.. ఆయ‌న విశాఖ‌-సికింద్ర‌బాద్ మ‌ధ్య న‌డిచే రైలుకు జ‌న్మ‌భూమి ఎక్స్‌ప్రెస్‌గా పేరు పెట్టించారు. ఇప్ప‌టికీ ఈ రైలు ప్ర‌యాణం కొన‌సాగుతోంది.

ఇలానే.. `అమ‌రావ‌తి` రాజ‌ధాని విష‌యంలోనూ కీల‌క నిర్ణ‌యం తీసుకుంటున్నార‌ని.. పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల చంద్ర‌బాబు పార్ల‌మెంటులో అమరావ‌తి బిల్లు పాసైన అనంత‌రం.. పార్టీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ స‌మ‌యంలో కొంద‌రు.. నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న అంశాన్ని ప్ర‌స్తావించారు. అమ‌రావ‌తి రాజ‌ధానిని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా మార్చాల‌ని కొంద‌రు ప్ర‌తిపాదించారు. దీనిపై చంద్ర‌బాబు సానుకూలంగా స్పందించారు. మంచి ఆలోచ‌న అని కితాబు కూడా ఇచ్చారు.

దీంతో వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి నియోజ‌క‌వ‌ర్గాల పెంపు ఉంటున్న నేప‌థ్యంలో రాజధాని అమ‌రావ‌తిని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా మార్చే ప్ర‌తిపాద‌న‌పై ఆయ‌న క‌స‌ర‌త్తు చేస్తున్న‌ట్టు కీల‌క నేత ఒక‌రు వెల్ల‌డించారు. త‌ద్వారా రాజ‌ధాని పేరు.. జాతీయ‌స్థాయి ఎన్నిక‌ల సంఘం రికార్డుల్లోనూ క‌నిపిస్తుంద‌ని.. అప్పుడు ఇక‌, రాజ‌ధానుల‌ను మార్చే దుస్థితి త‌ప్పుతుంద‌ని ఆయ‌న అంచ‌నా వేస్తున్న‌ట్టు తెలుస్తోంది. దీనిపై ఎలాంటి ప్ర‌తిపాద‌న చేయాల‌నే విష‌యంపై స్థానిక ఎమ్మెల్యేల‌తో ఆయ‌న చ‌ర్చించ‌నున్నారని తెలిసింది. ప్ర‌స్తుతం దేశంలో గాంధీన‌గ‌ర్‌(గుజ‌రాత్ రాజ‌ధాని) అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉంది. ఒకవేళ ఇది సాధ్యమైతే ఆ నియోజకవర్గం సీటు కోసం మినీ యుద్ధమే జరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

This post was last modified on April 5, 2026 1:35 pm

Share

Recent Posts

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

55 minutes ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

1 hour ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

2 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

10 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

12 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

12 hours ago