Movie News

మనసు మార్చుకున్న ఆదర్శం… మంచిదే కానీ

గత కొన్ని రోజులుగా బయట ప్రచారం జరుగుతున్నట్టు ఆదర్శ కుటుంబం ఏకె 47 ఒక వారం వాయిదా పడింది. ముందు నుంచి చెప్పిన అక్టోబర్ 2 కాకుండా అక్టోబర్ 9 థియేటర్లలో అడుగు పెడుతుంది. చివరి దశ షూటింగ్ జరుగుతుండటం, ప్యాచ్ వర్క్స్ తో పాటు రీ రికార్డింగ్ కు తమన్ మరికొంత సమయం అడగటం వల్ల పోస్ట్ పోన్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. వినడానికి బాగానే ఉంది కానీ ఆదర్శ కుటుంబం ఇలా హఠాత్తుగా తప్పుకోవడం వల్ల లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి.

మొదట లాభాల విషయానికి వస్తే ది ప్యారడైజ్ కనక సూపర్ హిట్ అయితే కనీసం రెండు వారాల పాటు దాని దూకుడు ఉంటుంది. సో కేవలం వన్ వీక్ గ్యాప్ లో ఆదర్శ కుటుంబం రావడం వల్ల మాస్ జనాలను తనవైపు లాగడం వెంకటేష్ కు కొంచెం కష్టమవుతుంది. కానీ రిస్క్ ఏంటంటే అక్టోబర్ 15 రజనీకాంత్ జైలర్ 2, మరుసటి రోజు విజయ్ దేవరకొండ రణబాలి, ధనుష్ ఓమ్ ఉన్నాయి. ఏడు రోజులు కావడం ఆలస్యం వీటితో ఆదర్శ కుటుంబం థియేటర్లు పంచుకోవాల్సి వస్తుంది. అసలే పండగ సీజన్.

అతి పెద్ద సానుకూలాంశం ఏమిటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో దసరా సెలవులు ఇచ్చిన టైంలో ఆదర్శ కుటుంబం రిలీజవుతోంది. ఇది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆడియన్స్ కోణంలో చాలా మేలు చేసే విషయం. కంటెంట్ సరిగ్గా పడితే త్రివిక్రమ్ దెబ్బకు రికార్డులు షేక్ అవుతాయి. అల వైకుంఠపురములో చేసింది ఇదే. అయితే గుంటూరు కారంలో జరిగిన పొరపాట్లకు ఈసారి అవకాశం ఇవ్వకుండా మాటల మాంత్రికుడు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారట.

వెంకటేష్ అభిమానులు మాత్రం ఈ పరిణామాల పట్ల పూర్తి హ్యాపీగా లేరు. లాంగ్ రన్ వచ్చే అవకాశం ఉన్న ఇలాంటి సినిమాలకు కనీసం రెండు వారాల స్పేస్ దక్కాలని, కానీ జైలర్ 2, రణబాలి, ఓమ్ రూపంలో అంత పోటీ ఉంటే ఎలా అనే యాంగిల్ లో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత బాక్సాఫీస్ కు పెద్ద పండగలా భావించే ఆదర్శ కుటుంబంకి ఇంత కన్నా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే సంక్రాంతికి వెంకీ మరో సినిమా జనవరి 12 విడుదల వచ్చేస్తుంది కాబట్టి.

This post was last modified on September 22, 2026 10:24 pm

Share

Recent Posts

చరణ్ కోసం అనిరుధ్ బెస్ట్ ఇవ్వాల్సిందే

పెద్ది తర్వాత మూడు నెలలకు పైగా రెస్ట్ మోడ్ లో ఉన్న రామ్ చరణ్ త్వరలో ఆర్సి 17 కోసం…

54 minutes ago

ఇంకో వాయిదా అడగనున్న ఆదర్శం ?

అక్టోబర్ 9 నుంచి తప్పుకున్నాక ఆదర్శ కుటుంబం ఏకె 47 కొత్త విడుదల తేదీ కోసం దగ్గుబాటి అభిమానులు కళ్ళు…

1 hour ago

రణబాలికి కాంతార రంగు

ఒక కొత్త సినిమా ప్రోమో రాగానే దాన్ని గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాలతో పోల్చడం ఆడియన్స్ కు అలవాటే.…

2 hours ago

పవన్ పాలనకు చిరు కితాబు

తల్లిదండ్రులు పిల్లల్ని పొగిడితే ఆయుక్షీణం అంటారు. పవన్ కళ్యాణ్‌కు చిరంజీవి పేరుకు అన్నయ్యే కానీ.. ఆయనది తండ్రి స్థానమే. అందుకేనేమో…

4 hours ago

రామాయణ చుట్టూ పోటీ ఆంజనేయుళ్లు

నిర్మాతలు అదిగో ఇదిగో అనడమే తప్పించి ఫలానా డేటుకి రామాయణ పార్ట్ 1 రిలీజ్ అవుతుందని ఇప్పటికీ చెప్పకపోవడం మహా…

4 hours ago

పిల్లల స్కూలు విషయాలు సూర్యనే చూసుకుంటాడు

తమిళ నటుడు సూర్య పెద్ద స్టార్ హీరో అయినా.. ఏమాత్రం భేషజం లేని, ఉన్నత వ్యక్తిత్వం తనది. అభిమానులను అక్కున…

4 hours ago