గ్రామీణ భారతంపై జనసేన సైలెంట్ వేవ్‌తో దూసుకుపోతోందా? ఇప్పటి వరకు పట్టణాలు, నగరాలకే పరిమితం అయిన జనసేన ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలపై తనదైన శైలిలో ముందుకు సాగాలని నిర్ణయించుకుందా? అంటే.. ఔననే సమాధానమే వినిపిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న పల్లె పండుగ-2.0ను మరింత ముందుకు తీసుకువెళ్లడం ద్వారా.. పట్టు పెంచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది. వాస్తవానికి పల్లెలపై జనసేనకు పట్టు పెద్దగా లేదు.
అయితే.. తరచుగా పల్లెల పర్యటనతోపాటు.. కేంద్రం నుంచి ఇస్తున్న నిధులను నేరుగా పంచాయతీలకు విడుదల చేయడం ద్వారా పల్లెల్లో జనసేనకు సానుకూల వాతావరణం ఏర్పడేలా చేసుకుంటున్నారు. ఒకప్పుడు పల్లెల్లో జనసేన గురించి పెద్దగా చర్చ ఉండేదికాదు. కానీ, ఇప్పుడు పవన్ కల్యాణ్ జపం ఎక్కువగా చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.
ఇది.. గ్రామీణ భారతంలో రూపు రేఖలను మార్చేస్తోంది. ఒకవైపు రహదారులను అభివృద్ధిచేయడంతో పాటు.. మరోవైపు.. పశువుల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్న గోశాలలు, నీటి సమస్య పరిష్కారానికి గ్రామీణ ఉపాధి పథకం కింద చెరువుల నిర్మాణం వంటివి గ్రామీణ స్థాయిలో మంచి మార్పునకు జనసేన ప్రయత్నం చేసింది. ఈ ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వచ్చే పంచాయతీ ఎన్నికల నాటికి.. జనసేన మరింత పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
అయితే.. ఈ క్రమంలో కూటమి ధర్మానికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలన్న నియమాన్ని ఖచ్చితంగా అమలు చేస్తున్నారు. మూడు పార్టీలతరఫున ప్రజల మధ్యకు వెళ్లాలని.. పల్లెపండుగను మరింత విజయవంతం చేయాలని జనసేన నుంచి బలమైన సంకేతాలు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా.. పార్టీ పరంగా చేస్తున్న చర్యలు.. ప్రభుత్వ పరంగా చేస్తున్న అభివృద్ధిని చూపించి.. గ్రామీణ ప్రాంతాల్లో పుంజుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పటికే సైలెంట్ వేవ్‌గా ఉన్న జనసేన వ్యూహం ఫలిస్తుందని భావిస్తున్నారు.
This post was last modified on March 4, 2026 3:46 pm
సీనియర్ నటుడు సుమంత్ ప్రధాన పాత్రలో వచ్చిన కొత్త సినిమా మహేంద్రగిరి వారాహి మీద విడుదలకు ముందు మంచి అంచనాలే…
తమిళనాడు సిఎం విజయ్ వారసుడిగా జేసన్ సంజయ్ హీరోగా తెరంగేట్రం చేసి ఉంటే ఈపాటికి అభిమానులు, నిర్మాతలు రెడ్ కార్పెట్…
హిందీలో దృశ్యం 3 బాగా ఆడుతున్న టైంలో టాలీవుడ్ ప్రేక్షకులకు వస్తున్న సందేహం ఒకటుంది. ఒకవేళ వెంకటేష్ కనక మూడో…
చైనాలో సోషల్ మీడియా ట్రెండ్‌లు, ఫొటోషూట్‌ల సంస్కృతిలో కొత్త మార్పు కనిపిస్తోంది. ప్రస్తుతం కొందరు యువతులు మేల్ మోడల్స్‌తో ప్రత్యేకంగా…
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…