నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ తెలిసిందే. పసి పిల్లల తల్లీ దండ్రులకు శిశు దర్శనం పేరుతో కేవలం 40 నిముషాల్లోనే స్వామి వారిని దర్శించుకునే భాగ్యం కల్పించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఎలాంటి రుసుము లేకుండా, ఆన్లైన్ బుకింగ్ టోకెన్లు లేకుండానే ఈ సౌకర్యం పొందే అవకాశం వుంది.
శిశు దర్శనానికి వెళ్లే దంపతులకు ఒక సంవత్సరంలోపు పిల్లలు ఉండాలి. చిన్నారితో పాటుగా తల్లీ తండ్రికి దర్శనానికి అనుమతిస్తారు. ఒకవేళ వారికి 12 ఏళ్ళ లోపు పిల్లలుంటే వారికి కూడా అనుమతి ఉంటుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6గంటల లోపు ‘సుపథం ‘ మార్గం ద్వారా లోపలికి అనుమతిస్తారు. ఇందుకోసం సుపథం వద్దకు వెళ్లి శిశువు బర్త్ సర్టిఫికెట్ లేదా హాస్పిటల్ డిశ్చార్జీ సమ్మరీ లెటర్ చూపిస్తే చాలు.
దీనికి షరతులు వర్తిస్తాయి. టీటీడి నిబంధనల ప్రకారం సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. 40 నిముషాల్లో దర్శనం పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది కనుక సుపథం వద్దకు ఎంత త్వరగా చేరుకుంటే అంత మంచిది. శిశువుకు ఇబ్బంది కలగకుండా పాలు, డైపర్స్, మంచి నీళ్లు తీసుకొని వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. పూర్తి వివరాల కోసం టీటీడీ హెల్ప్ లైన్ నెంబర్ 0877-2233333 కు కాల్ చేయాలని అధికారులు తెలిపారు.
This post was last modified on August 4, 2026 7:15 am
ఒక ప్రాంతానికి సంబంధించిన పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాలు తీసేటప్పుడు యాస విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. డైలాగులు రాయడం…
తాజాగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న పార్టీలే హవా చూపించాయి.…
బీసీలంటే వెనక బడిన కులాలు కాదు బ్యాక్ బోన్ కులాలంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నానికి సుప్రీం కోర్టు తీర్పుతో ఆటంకం…
తమిళనాడు బై ఎలక్షన్లలో అధికార టీవీకే పార్టీ తన ఆధిపత్యాన్ని చాటుకుంది. శుక్రవారం ఉదయం కౌంటింగ్ మొదలైన తర్వాత తొలి…
ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది యంగ్ హీరోలది ఒకటే మాట. తమ సినిమాలను ఎవరో పనిగట్టుకుని టార్గెట్ చేస్తున్నారని. తమ చుట్టూ…
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…