లోకనాయకుడు కమల్ హాసన్ పనైపోయిందనుకున్న సమయంలో ఆయన అదిరిపోయే కమ్ బ్యాక్ ఇచ్చిన సినిమా.. విక్రమ్. ఆ సినిమాతోనే సౌత్ సినిమాలో లోకేష్ కనకరాజ్ పేరు మార్మోగిపోయింది. ఈ సినిమాలో మిగతా సన్నివేశాలన్నీ ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో సూర్యను రోలెక్స్ పాత్రలో పరిచయం చేస్తూ నడిపించిన పది నిమిషాల ఎపిసోడ్ మరో ఎత్తు. సినిమాను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లి, ప్రేక్షకులు మాంచి హైతో థియేటర్ల నుంచి బయటికి వచ్చేలా చేసిందా పాత్ర.
ఈ రోలెక్స్ క్యారెక్టర్‌నే లీడ్ రోల్‌లో పెట్టి సినిమా తీస్తానని దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇలాగే ఏళ్లు గడిచిపోతున్నాయి. లోకేష్ చేయాలనుకున్న విక్రమ్-2, ఖైదీ-2 సినిమాల విషయంలోనే ఇంకా క్లారిటీ రాని నేపథ్యంలో ‘రోలెక్స్’ మూవీ సాధ్యమవుతుందో లేదో తెలియట్లేదు. అసలు సూర్యకు ఈ సినిమా చేసే ఉద్దేశం ఉందా లేదా అన్న దానిపైనా క్లారిటీ లేదు.
తన కొత్త చిత్రం ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సూర్య ‘రోలెక్స్’ గురించి అడిగితే తనకూ ఏమీ తెలియదు అనేశాడు. లోకేష్ అసలేం చేస్తున్నాడో క్లారిటీ లేదని అతను చెప్పాడు. అల్లు అర్జున్‌తో చేయాల్సిన సినిమాతో లోకేష్ బిజీగా ఉన్నట్లు కనిపిస్తోందని.. రోలెక్స్ కంటే ముందు అతను ‘విక్రమ్-2’ చేయాల్సి ఉందని చెప్పాడు. రోలెక్స్ అనే సినిమా ఉంటుందా లేదా అన్నది కాలమే సమాధానం చెప్పాలని, ఇప్పుడు ఏమీ చెప్పలేమని సూర్య అన్నాడు.
తాను మలయాళ దర్శకుడు జీతు మాధవన్‌తో చేస్తున్న సినిమా షూటింగ్ పూర్తయిందని, ఆ చిత్రం ఏడాది చివర్లో రిలీజవుతుందని సూర్య క్లారిటీ ఇచ్చాడు. ఇక తన చివరి సినిమా ‘కరుప్పు’ రిలీజ్ ముంగిట ఎదురైన సమస్యల గురించి సూర్య మాట్లాడుతూ.. ఫైనాన్స్ క్లియరెన్స్ కోసం అప్పటికప్పుడు లోన్లు తీసుకున్నానని, అది తమ స్థాయికి మించిన బరువే అని, ఏదైనా తేడా కొడితే కుటుంబమంతా దాన్ని ఫేస్ చేయాల్సి వచ్చేదని, అదృష్టవశాత్తూ ‘కరుప్పు’ బాగా ఆడడంతో అన్ని ఇబ్బందులూ తొలగిపోయాయని సూర్య వ్యాఖ్యానించాడు.
This post was last modified on August 4, 2026 12:32 pm
టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…
ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…