Movie News

ఫౌజీ ప్లానింగ్ విభిన్నంగా ఉంటుందా?

డిసెంబర్ 3 ఎప్పుడెప్పుడు వస్తుందాని ప్రభాస్ అభిమానులు కళ్ళలో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ముందు రోజే ప్రీమియర్లు ఉంటాయని నిర్మాత ఇటీవలే కన్ఫర్మ్ చేయడంతో 2026 బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఫౌజీ పేరు మీదే ఉంటుందని బలంగా నమ్ముతున్నారు. ఇప్పటిదాకా టీమ్ నుంచి వచ్చినవి కేవలం రెండు పోస్టర్లు మాత్రమే. పాటల విడుదల ఇంకా స్టార్ట్ చేయలేదు. విశాల్ చంద్రశేఖర్ చాలా గొప్ప ఆల్బమ్ ఇచ్చాడనేది యూనిట్ వర్గాల మాట.

ప్రమోషన్ల పరంగా ఫౌజీ కొత్త తరహాలో వెళ్ళబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అంటే ఎలాంటి వీడియో కంటెంట్ లేకుండా కేవలం స్టిల్స్, పోస్టర్స్ తోనే పబ్లిసిటీ చేస్తారన్న మాట. ఈ లెక్కన ట్రైలర్ కూడా రాదు. కంటెంట్ అంత సాలిడ్ గా ఉంది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారని, విజువల్స్ ద్వారా కథను గెస్ చేసే అవకాశం ఇవ్వకుండా ఇలా అనుకుంటున్నారని వినికిడి. అయితే నిజంగా ఫిక్స్ అయ్యారా లేక కేవలం ఆలోచన దశ దగ్గర ఉందానేది ఇంకొద్ది రోజులు ఆగితే తెలుస్తుంది.

రాజా సాబ్ డిజాస్టర్ దెబ్బ మాములుగా తగల్లేదు. ఫ్యాన్స్ తెగ ఫీలైపోయి దర్శకుడు మారుతీని నెలల తరబడి ట్రోలింగ్ చేశారు. ఆయన చాలా కాలం బయట కనిపించడం కూడా మానేశారు. ఇప్పటికీ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ రాలేదు. హ్యాపీ పొంగల్ పేరుతో ఒక స్క్రిప్ట్ రాసుకున్నారని, హీరో లాక్ అయితే తప్ప ప్రకటన రాదని ఆల్రెడీ వార్త చక్కర్లు కొడుతోంది. ఆ గాయం ఫౌజీ మాన్పాలని ఫ్యాన్స్ కోరిక. ఇదిలా ఉండగా ఫౌజీని ప్యాన్ ఇండియా భాషల్లోనే కాకుండా వీలైనన్ని ఫారిన్ లాంగ్వేజెస్ లో కూడా ప్లాన్ చేస్తున్నారట. .

దర్శకుడు హను రాఘవపూడి ప్రస్తుతం చివరి షెడ్యూల్ కి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇంకోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆగస్ట్ మినహాయిస్తే అటుపై కేవలం మూడు నెలలు మాత్రమే టైం ఉంటుంది. ప్రమోషన్లు చేసినా చేయకపోయినా ఫస్ట్ కాపీ అయితే నవంబర్ రెండో వారంకంతా సిద్ధం కావలి. ఓవర్సీస్ కంటెంట్ డెలివరీలో చివరి నిమిషం టెన్షన్లు లేకుండా చూసుకోవాలి. మైత్రి సంస్థ నిర్మిస్తున్న ఫౌజీ ఇంకా బిజినెస్ డీల్స్ ఖరారు చేయలేదని సమాచారం. 

This post was last modified on August 4, 2026 2:25 pm

Share

Recent Posts

ర‌వితేజ హిట్టు కొడితే ఆల్ హ్యాపీస్

తెలుగు సినీ అభిమానుల్లో ఎన్నెన్ని వ‌ర్గాలున్నాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అందులో ఒక వ‌ర్గానికి ఇంకో వ‌ర్గానికి అస్స‌లు…

32 minutes ago

హిందీ డబ్బింగ్ దమ్మేంటో చెప్పిన నాగ్

ఒక‌ప్పుడు హిందీ సినిమాలు తెలుగులోకి అనువాదం కావ‌డం, ఇక్క‌డ పెద్ద స్థాయిలో రిలీజ్ కావ‌డ‌మే ఉండేది త‌ప్ప‌.. తెలుగు చిత్రాలు…

4 hours ago

య‌శ్‌ను భ‌య‌పెట్టేసిన మ‌ల్లారెడ్డి

మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి స్టేజ్ ఎక్కారంటే, మైక్ అందుకున్నారు అంటే మెరుపులు మెర‌వాల్సిందే. అది రాజ‌కీయ స‌భ అయినా.. సినిమా…

6 hours ago

అక్కడ ఒక్కో కోతి 25 లక్షలు

మన దేశంలో చాలా చోట్ల కోతుల బెడద ఉంది. అడవుల నరికివేత, పట్టణీకరణ నేపథ్యంలో కోతులు జనావాసాల మధ్యకు వచ్చాయి.…

6 hours ago

చిరు బ‌ర్త్ డే… ట్రెండింగ్ లో మాత్రం బన్నీ..

అల్లు అర్జున్ అంటే ఒక‌ప్పుడు మెగా హీరోల్లో ఒక‌డు. అత‌ను మెగాస్టార్ చిరంజీవినో, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌నో పొగిడితేనో..…

6 hours ago

విశ్వనాథ్ తట్టుకుని నిలవడం విశేషమే

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఇరుముడి తప్ప మరొక మాట వినిపించదేమో అన్న రేంజ్ లో వసూళ్లు హోరెత్తిపోతున్నాయి. ఈ జోరు…

7 hours ago