Political News

మాజీ ముఖ్యమంత్రి తనయుడు అరెస్టు… అక్కడ పొలిటికల్ హీట్!

తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష, ముఖ్యమంత్రి విజయ్‌పై పరువునష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా చెన్నైలోని ఆయన నివాసానికి వెళ్లిన పోలీసులు విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు.

తంజావూరులో కావేరి జలాల అంశంపై పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన సందర్భంగా, “ముఖ్యమంత్రి విజయ్‌కు ఒకటే టెన్షన్ ఉంది” అని ఉదయనిధి వ్యాఖ్యానించగా, అక్కడున్న కొందరు కార్యకర్తలు “త్రిష” అంటూ నినాదాలు చేశారు. ఈ పరిణామంపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, కార్యకర్తలతో ఉద్దేశపూర్వకంగానే అలాంటి నినాదాలు చేయించారని ఆరోపించింది. దీనిపై కేసు నమోదుకాగా, టీవీకే కార్యకర్తలు చెన్నైలో నిరసనలు చేపట్టారు.

అరెస్టును అడ్డుకోవాలని డీఎంకే మద్రాస్ హైకోర్టును అత్యవసరంగా ఆశ్రయించింది. బుధవారం తమిళనాడు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ చర్య రాజకీయ కక్షసాధింపేనని డీఎంకే విమర్శించింది. తన అరెస్టుపై స్పందించిన ఉదయనిధి స్టాలిన్, “నేను ఎవరి పేరూ ప్రస్తావించలేదు. అసభ్యకరంగా కూడా మాట్లాడలేదు. అరెస్టుకు భయపడను. చట్టపరంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాను” అని తెలిపారు.

This post was last modified on August 4, 2026 12:26 pm

Share

Recent Posts

సెన్సార్ మీద ఎంత వ్యతిరేకత చూపించినా

టాలీవుడ్ లో గత ఏడాదికి పైగా సెన్సార్ బోర్డు వ్యవహార శైలి మీద తీవ్ర చర్చలు జరుగుతున్నాయి. చిన్న చిన్న…

2 hours ago

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా…

3 hours ago

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

3 hours ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

4 hours ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

4 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

5 hours ago