Political News

జగన్ ఇంటి ముందు బోరుగడ్డ అనిల్ నిరసన

బోరుగడ్డ అనిల్ కుమార్ ఏపీ ప్రజలకు బాగా గుర్తున్న పేరు. వైసీపీ అధికారంలో ఉండగా… జగన్ ఆదేశిస్తే టీడీపీ అదినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడితో పాటు ఆయన కుమారుడు నారా లోకేశ్ లను గంటలో లేపేస్తానంటూ.. పవన్ వైజాగ్ లో అడుగు పెట్టీ చూడమని అసభ్య పదజాలంతో సవాలు విసిరి సంచలన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిగా అనిల్ అందరికీ తెలుసు. జగన్ ఆదేశించారో, లేదో తెలియదు గానీ.. అనిల్ మాత్రం తాను జగన్ ఆదేశాలతోనే నడుచుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అరెస్టు, జైలు గడిచిన తర్వాత జైలు నుంచి బయటకు వచ్చిన అనిల్ చాలా రోజులుగా కనిపించలేదు. ఉన్నట్టుండి మంగళవారం ఆయన తాడేపల్లిలోని జగన్ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఓ నిరసనకారుడిగా ఆయన కనిపించారు.

తన సతీమణిని వెంటేసుకుని మరీ తాడేపల్లి వచ్చిన అనిల్… జగన్ నివాసం ముందు ధర్నాకు దిగారు. భార్యతో కలిసి కూర్చున్న అనిల్ అక్కడ ఉన్న కొందరు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తాను జగన్ ను కలవాలని అనుకుంటు ఉన్నానని చెప్పిన అనిల్… అందుకు వైసీపీ రాస్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి అనుమతించడం లేదని సంచలన ఆరోపణ గుప్పించారు. జగన్ కోసం కష్టపడ్డ తనను జగన్ వద్దకు ఎందుకు పంపరని కూడా ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా పార్టీ నేతలతో తనను రౌడీ షీటర్ అని ముద్ర వేయించే పనిని సజ్జల నిరాటంకంగా కొనసాగిస్తున్నారని ఆరోపించారు. 

ఈ సందర్భంగా వైసీపీ అదికారి ప్రతినిధి హోదాలో టీవీ బీడేట్లకు హాజరయ్యే కారుమూరు వెంకట రెడ్డి తనను రౌడీ షీటర్ అని అన్నారని… ఆ వీడియో చూశాక తానే వెంకట రెడ్డికి నేరుగా ఫోన్ చేశానని అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా సజ్జలతో పాటు మరో వైసీపీ నేత పూడి శ్రీధర్ తనను రౌడీ షీటర్ గా ముద్ర వేయాలని వెంకట రెడ్డికి ఆదేశించారని తేలిందన్నారు.

హైకోర్టే తనను ఉన్నత విద్యావంతుడిగా పరిగణిస్తే… తనను రౌడీ షీటర్ అనడానికి సజ్జలకు గానీ ఇతరత్రా వైసీపీ నేతలకు గానీ ఎలాంటి అధికారం ఉందని ఆయన ప్రశ్నించారు. తనపై కేసులు నమోదు అయిన సమయంలో తనను రౌడీ షీటర్ గా పిలిచినందుకు ఏకంగా 12 మంది పోలీసు అధికారులకు హైకోర్టు నోటీసులు ఇచ్చిందని కూడా అనిల్ తెలిపారు. ఈ సందర్భంగా తాను వెంకటరెడ్డితో మాట్లాడిన ఫోన్ సంభాషణను ఆయన మీడియా ప్రతినిధులకు వినిపించారు.

జగన్ కోసం ఏమైనా చేస్తానని బీరాలు పలికిన అనిల్… కూటమి సర్కారు అదికారంలోకి వచ్చినంతనే కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసుల్లో తప్పించుకునేందుకు అనిల్ చేసిన యత్నాలేవీ ఫలించలేదు. ఈ క్రమంలో ఆయనను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు ఆదేశాలతో జైలుకు తరలించారు. కోర్టు విచారణల నిమిత్తం జైలు నుంచి కోర్టుకు హాజరయ్యే క్రమంలో ఆయనకు పోలీసులు చేసిన మర్యాదలు పలుమార్లు బయటకు వచ్చి కలకలం రేపాయి.

పోలీస్ స్టేషన్లలోనూ అనిల్ కు కొందరు పోలీసులు సహకరించిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది. అంతేకాకుండా పెరోల్ మీద బయటకు వచ్చిన అనిల్… సకాలంలో తిరిగి లొంగిపోని వైనం, ఆ తర్వాత కోర్టు ఆదేశాలతో ఆయన జైలుకు పరుగులు పెట్టిన వైనం కూడా ఆసక్తి రేకెత్తించింది. ఒకప్పుడు పెద్ద పెద్ద నేతలనే బెదిరించిన అనిల్.. ఇప్పుడు నిరసనకారుడిగా.. అది కూడా జగన్ ఇంటి ముందు నిరసనకు దిగి ఆయన అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 

This post was last modified on August 4, 2026 2:46 pm

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

12 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

41 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago