Movie News

పైసా ప్రమోషన్ లేకుండా స్పైడర్‌మ్యాన్ బీభత్సం

గత నెల మధ్యలో ‘ది ఒడిస్సీ’ సినిమా రిలీజ్ టైంలో ఎంత హడావుడి నెలకొందో చూశాం. ప్రస్తుతం వరల్డ్ సినిమా నంబర్ వన్ డైరెక్టర్ అనదగ్గ క్రిస్టఫర్ నోలన్ డైరెక్ట్ చేసిన చిత్రమది. ఆయనకు ఇండియాలో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. అది దృష్టిలో పెట్టుకునే నోలన్.. తన టీంతో కలిసి ఇండియాకు వచ్చి ఆ చిత్రాన్ని ప్రమోట్ చేశాడు. అది సినిమాకు బాగా ప్లస్ అయింది. నోలన్ గత చిత్రాల కంటే ‘ది ఒడిస్సీ’కి ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి.

కానీ ఇంకో రెండు వారాల తర్వాత మరో హాలీవుడ్ చిత్రం రిలీజైంది. దానికి ఇండియాలో ఎలాంటి ప్రమోషన్లూ లేవు. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బీభత్సం సృష్టిస్తోంది. తొలి వీకెండ్లోనే ఏకంగా రూ.300 కోట్లు కొల్లగొట్టి ఔరా అనిపించింది. ఆ చిత్రమే.. స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే. స్పైడర్ మ్యాన్ చిత్రాలకు ఇండియాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడూ క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. కానీ ‘బ్రాండ్ న్యూ డే’కు వచ్చిన హైప్ మాత్రం వేరే లెవెల్. ఈ చిత్రంలో లీడ్ రోల్ చేసిన టామ్ హాలండ్ ‘ది ఒడిస్సీ’లో కూడా కీలక పాత్ర చేశాడు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇండియాకూ వచ్చాడు.

కానీ హాలండ్ ‘స్పైడర్ మ్యాన్’ను మాత్రం అలా ప్రమోట్ చేయలేదు. మిగతా టీంలో ఎవ్వరూ కూాడా ఇండియాకు రాలేదు. ముందు రోజు పెద్ద సిటీల్లో ప్రిమియర్స్ వేయడం తప్పితే.. ప్రమోషన్ల పరంగా ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. అయినా సరే.. ఈ చిత్రానికి ‘స్పైడర్ మ్యాన్’ ఫ్రాంఛైజీలో మరే సినిమాకూ రానంత క్రేజ్ వచ్చేసింది. ‘అవెంజర్స్: ఎండ్ గేమ్’, ‘అవతార్’ సినిమాలకు దీటైన హైప్‌తో రిలీజైన ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ అన్ని అంచనాలను మించిపోయి వసూళ్లు రాబట్టింది. 

త్రీడీ ఛార్జెస్‌తో కలిపి తొలి రోజే రూ.80 కోట్ల మేర వసూళ్లు రాబట్టి ఆల్ టైం హాలీవుడ్ డే-1 గ్రాసర్‌గా ఇండియాలో రికార్డు నెలకొల్పిన ఈ చిత్రం.. ఆదివారం ఏకంగా రూ.100 కోట్ల మైలురాయిని టచ్ చేసింది. ఒక్క రోజులో ఇండియాలో వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలు వేళ్ల మీద లెక్కబెట్టే సంఖ్యలో మాత్రమే ఉన్నాయి. అలాంటి సినిమాల సరసన ‘స్పైడర్ మ్యాన్’ చేరడం అసామాన్యమైన విషయం. ఈ చిత్రం రూ.500 కోట్ల మార్కును అందుకోనున్న తొలి హాలీవుడ్ మూవీగానూ నిలవడం లాంఛనమే.

This post was last modified on August 4, 2026 12:29 pm

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

11 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

41 minutes ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago