రెండేళ్లలో పెట్టుబడులు గ్రౌండ్ అవుతాయా?

వ‌చ్చే రెండేళ్ల‌లో ఏపీ ముఖ చిత్రం మార‌నుంద‌న్న వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. వ‌చ్చే రెండేళ్ల‌లోనే స‌మూలంగా ఏపీ ముఖ చిత్రం మారిపోతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. దీనికి ప్ర‌ధానంగా మూడు రీజ‌న్లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు. 1) పెట్టుబ‌డులు గ్రౌండ్ కావ‌డం. 2) ప్రాజెక్టులు పూర్తి చేయ‌డం. 3) పాల‌న ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌కత‌కు పెద్ద‌పీట వేయ‌డం. చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల‌ ఇమేజ్ మ‌రింత పెర‌గ‌డం.

1) పెట్టుబ‌డులు: ఇప్ప‌టి వ‌ర‌కు గ‌త ఏడాది కాలంలో 23.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వం ఒప్పందాలు చేసుకుంది. ఆయా కంపెనీల‌కు భూములు కూడా కేటాయించింది. రాబోయే రోజుల్లో మ‌రిన్ని ఒప్పందాలు చేసుకుంటుంది. ఇది ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. ఇప్పటి వ‌ర‌కు చేసుకున్న ఒప్పందాలు గ్రౌండ్ అయ్యేందుకు ఏడాదిన్న‌ర సమ‌యం ప‌ట్ట‌నుంది. అప్పుడు భారీ ఎత్తున ఉద్యోగాలు, ఉపాధి అవ‌కాశాలు మెరుగు ప‌డ‌నున్నాయి. ఇది ఏపీని ఉన్న‌త స్థాయికి చేరుస్తుంది.

2) ప్రాజెక్టులు పూర్తి: పోల‌వ‌రం స‌హా.. ఇత‌ర సాగునీటి ప్రాజెక్టుల‌ను పూర్తి చేసేందుకు టైంబౌండ్‌తో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. వీటిని రెండేళ్ల‌లో పూర్తి చేసేందుకు సంక‌ల్పం చెప్పుకొంది. ముఖ్యంగా పోల‌వ‌రం, న‌ల్ల‌మ‌ల సాగ‌ర్‌ల‌ను ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకుంది. ఇక‌, అమ‌రావ‌తి రాజ‌ధానికి 2028 నాటికి తొలి ద‌శ పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించుకుంది. త‌ద్వారా.. వ‌చ్చే రెండేళ్ల‌లో ఈ ప్రాజెక్టులు పూర్తి చేయాల‌ని భావిస్తోంది. ఇవి సాకారం కావ‌డం త‌థ్య‌మైతే.. ఇక‌, ఏపీ ఉనికి మ‌రోస్థాయికి చేరుతుంది.

3) పాల‌న‌, ఇమేజ్‌: ఈ రెండు కూడా ఏపీని మ‌రో లెవిల్‌కు తీసుకువెళ్ల‌నున్నాయి. పాల‌న ప‌రంగా మ‌రింత పార‌ద‌ర్శ‌క‌త‌కు పెద్ద‌పీట వేయ‌నున్నారు. ప్ర‌జ‌ల ఇష్టానికి ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. త‌ద్వారా.. ప్ర‌జ‌ల‌పై భారాలు త‌గ్గించ‌నున్నారు. ఇక‌, చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్‌ల ఇమేజ్ కూడా మ‌రింత పెర‌గ‌నుంది. గ్రామ స్థాయిలో ప‌వ‌న్‌, నగ‌రాలు ప‌ట్ట‌ణాల స్థాయిలో చంద్ర‌బాబు ఇమేజ్‌కు ఢోకా ఉండ‌ద‌న్న అంచ‌నాలు వ‌స్తున్నాయి. దీంతో వ‌చ్చే రెండేళ్లలో భారీ మార్పులు చోటు చేసుకుంటాయ‌ని అంటున్నారు.