దావోస్ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం చంద్రబాబు.. మార్గం మధ్యలో జ్యురిచ్‌లో ఆగారు. షెడ్యూల్‌లో భాగంగా జ్యూరిచ్‌లోనూ పలు కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లు పాల్గొంటారు. జ్యూరిచ్‌కు చేరుకోగానే.. సీఎం చంద్రబాబుకు స్థానిక తెలుగు వారి నుంచి భారీ స్వాగతం లభించింది. 20కి పైగా యూరప్ దేశాలకు చెందిన ఎన్నారైలు.. టీడీపీ కార్యకర్తలు, అభిమానులు ప్రత్యేక వాహనాల్లో తరలి వచ్చి.. సీఎంకు స్వాగతం పలికారు.
అనంతరం.. భారత అంబాసిడర్ మృదుల్ కుమార్ కూడా సీఎం చంద్రబాబుకు ప్రొటోకాల్ స్వాగతం పలి కారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు ఆయనతో ఏపీకి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పెట్టుబడులకు ఏపీ స్వర్గధామంగా ఉందన్నారు. జ్యూరిచ్‌లో ఈ రోజు రేపు.. కీలక సమావేశం జరగనుంది. దీనిలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. పలు అంతర్జాతీయ సంస్థలు ఈ సమావేశానికి హాజరయ్యాయి. దీనిలో సీఎం చంద్రబాబు ప్రత్యేక ప్రసంగం చేయనున్నారు.
ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యాపారం, విద్య, పరిశ్రమల అభివృద్ధి, పెట్టుబడులపై ఆయ న దిశానిర్దేశం చేస్తారు. అదేవిధంగా జ్యూరిచ్‌లో సింగపూర్ అధ్యక్షుడు షణ్ముగంతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా అమరావతి రాజధానిలో జరుగుతున్న పనులను ఆయనకు వివరించారు. 2028నాటికి తొలిదశ పనులు పూర్తయ్యేలా వేగం పెంచామని చెప్పారు. సింగపూర్ భాగస్వామ్యాన్ని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోలను చంద్రబాబు తన ఎక్స్‌లో పోస్టు చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
