క‌ష్టాల్లో కానిస్టేబుల్ త‌ల్లి… వెంటనే స్పందించిన లోకేష్‌!

ఏపీ మంత్రి నారా లోకేష్ మ‌రోసారి త‌న మ‌న‌సు చాటుకున్నారు. లోక‌ల్‌గానే కాదు… విదేశాల్లో కూడా ఎవ‌రైనా ఇబ్బందుల్లో ఉన్నార‌ని తెలిస్తే.. వెంట‌నే ఆయ‌న రియాక్ట్ అవుతున్నారు. స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. గ‌తంలో అనేక మందిని కువైత్‌, దుబాయ్ స‌హా ఎడారి దేశాల నుంచి తీసుకువ‌చ్చారు.

ఆయా వ్య‌క్తులు.. ఏదో ఒక ప‌నిపై అక్క‌డ‌కు వెళ్ల‌డం. . ఏజెంట్ల చేతిలో న‌ష్ట‌పోవ‌డం వంటివి కామ‌న్‌గా మారింది. క‌ష్టాల్లో ఉన్న‌త‌మ‌ను కాపాడాల‌ని సెల్ఫీ వీడియోలు, స‌మాచారం వారు లోకేష్‌కు పంచుకోవ‌డంతో వెంట‌నే ఆయ‌న రంగంలోకి దిగి వారిని సుర‌క్షితంగా తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాజాగా ఇలాంటి క‌ష్ట‌మే ప్ర‌స్తుతం ట్రైనింగ్‌లో ఓ కానిస్టేబుల్‌కు ఎదురైంది. గ‌త నెల‌లో జ‌రిగిన కానిస్టేబుల్ నియామ‌కాల్లో ఉద్యోగం సంపాయించిన సాయి అనే యువ‌కుడు.. కువైత్‌లో త‌న మాతృమూర్తి ప‌డుతున్న ఇబ్బందుల‌ను సోష‌ల్ మీడియాలో పంచుకున్నారు.

అక్క‌డ త‌న త‌ల్లిని కొంద‌రు హింసిస్తున్నార‌ని.. ఆమెను కాపాడాల‌ని వేడుకున్నారు. అంతేకాదు.. త‌న‌కు త‌ల్లి త‌ప్ప‌.. మ‌రెవ‌రూ లేర‌ని కూడా వాపోయారు. మంత్రి నారా లోకేష్ జోక్యం చేసుకుని త‌న త‌ల్లిని వెన‌క్కి తీసుకురావాల‌ని కోరుకున్నారు. ఈ వీడియో పై నారా లోకేష్ ఇమ్మీడియెట్‌గా స్పందించారు.

శిక్ష‌ణ‌లో ఉన్న కానిస్టేబుల్‌కు భ‌రోసా ఇచ్చారు. మీ అమ్మ‌ను కాపాడేందుకు.. ఆమెను సుర‌క్షితంగా తీసుకువ‌చ్చేందుకు లేదా.. అక్క‌డే స‌రైన వాతావ‌ర‌ణం క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు తెలిపారు. ఇప్ప‌టికే కువైత్‌లోని త‌న బృందం(ఎన్నారై టీడీపీ) వివ‌రాలు సేక‌రించింద‌ని.. సంబంధిత అధికారుల‌తో కూడా ఈ బృందంచ‌ర్చిస్తోంద‌ని తెలిపారు.

ధైర్యంగా ఉండాల‌ని సూచించారు. తాను ఎప్ప‌టిక‌ప్పుడు ఈ విష‌యాన్ని స‌మీక్షిస్తాన‌ని కూడా నారా లోకేష్ స‌ద‌రు కానిస్టేబుల్‌కు ధైర్యం చెప్పారు. దీంతో కానిస్టేబుల్ విన్న‌పాన్ని ఆయ‌న సంబంధిత అధికారుల‌కు.. చేర‌వేశారు. ఈ విష‌యాన్ని ప‌రిశీలించి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని ఆయ‌న సూచించారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించాల‌న్నారు.