‘కాపు ముఖ్యమంత్రి’ అంటూ మాజీ సీఐడీ చీఫ్ వ్యాఖ, డిప్యూటీ ఏమన్నారు?

ఏపీ సీఐడీ చీఫ్‌గా ప‌నిచేసి.. ప్ర‌స్తుతం స‌స్పెన్ష‌న్‌లో ఉన్న ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని కోరుతూ.. టీడీపీ నేత‌, ఉండి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే, అసెంబ్లీ ఉప స‌భాప‌తి క‌నుమూరి ర‌ఘురామ‌కృష్ణ‌రాజు కోరారు. సునీల్ ప‌నిగ‌ట్టుకుని కులాల‌నురెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని డిపార్ట్ మెంట్ ఆఫ్ ప‌ర్స‌న‌ల్(డీవోపీటీ)కి లేఖ రాశారు. ఈ లేఖ‌లో తాజాగా సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు.

ఐపీఎస్ అధికారిగా ఉన్న సునీల్‌కుమార్‌కు డిపార్ట్‌మెంటు రూల్స్ వ‌ర్తిస్తాయ‌ని, దీని ప్ర‌చారం ప‌ద‌వుల్లో ఉండి.. రాజ‌కీయ ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం త‌ప్ప‌ని ర‌ఘురామ పేర్కొన్నారు. పైగా రాజకీయ‌ప‌ర‌మైన కార్య‌క్ర‌మాలు, స‌భ‌లు, స‌మావేశాల‌లో పాల్గొన‌డంపై అధికారుల‌కు నిషేధం ఉంటుంద‌ని గుర్తు చేశారు. ఈ విష‌యాన్ని తెలిసి కూడా సీనియ‌ర్ ఐపీఎస్ అదికారి అయిన సునీల్ త‌ప్పు చేశార‌ని ర‌ఘురామ పేర్కొన్నారు. ఆయ‌న‌పై త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డీవోపీటీకి ఫిర్యాదు చేశారు. కాపులు, అదేస‌మ‌యంలో ద‌ళితుల‌ను కూడా ఆయ‌న రెచ్చ‌గొడుతున్నార‌ని పేర్కొన్నారు.

మ‌రోవైపు.. సునీల్‌పైకేసులు ఉన్నాయ‌ని తెలిపిన ర‌ఘురామ‌.. దీనిపై విచార‌ణ కూడాజ‌రుగుతోంద‌న్నారు. ఇప్ప‌టికే ఏపీ పోలీసులు ఆయ‌న‌కు నోటీసులు కూడా ఇచ్చార‌ని తెలిపారు. విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సిన సునీల్ ఇలా రాజ‌కీయ ప‌ర‌మైన వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదేనని సునీల్ చేసిన వ్యాఖ్యలను ర‌ఘురామ ఉటంకించారు. ఈ వ్యాఖ్యలు అఖిల భారత సర్వీసు రూల్స్‌కు విరుద్ధమని, కాబ‌ట్టి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుని.. భ‌విష్య‌త్తులో ఎవ‌రూ ఇలా వ్యాఖ్యానించ‌కుండా.. ఆద‌ర్శంగా నిల‌వాల‌ని సూచించారు. సునీల్‌ను స‌ర్వీసు నుంచి తొల‌గించాల‌ని కోరారు.

సునీల్ ఏమ‌న్నారు?

గుంటూరులో నిర్వ‌హించిన ద‌ళిత బ‌హుజ‌నుల స‌మావేశంలో ఆదివారం పాల్గొన్న సునీల్‌.. ద‌ళితులు-కాపులు రాష్ట్రంలో ఎక్కువ మంది ఉన్నార‌ని తెలిపారు. ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా.. వీరి మ‌ద్ద‌తు అత్యంత కీల‌క‌మ‌ని వ్యాఖ్యానించారు. ఒక పార్టీకి మ‌ద్ద‌తు తెలిపే బ‌దులు దళితులు-కాపులు ఏకమై కూట‌మిగా నిలిస్తే.. రాజ్యాధికారం ద‌క్కుతుంద‌ని చెప్పారు. అనంత‌రం కాపులు ఎప్ప‌టి నుంచో ఎదురు చూస్తున్న‌ముఖ్య‌మంత్రిప‌ద‌విని పొంద‌వ‌చ్చ‌న్నారు. ద‌ళితుల‌కు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌విని ఇవ్వాల‌ని పేర్కొన్నారు. త‌ద్వారా.. ద‌ళితులు త‌మ స‌మ‌స్య‌లు తాము ప‌రిష్క‌రించుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌న్నారు. ఈ వ్యాఖ్య‌ల‌పైనే ర‌ఘురామ ఇప్పుడు ఫిర్యాదు చేశారు.