టీడీపీ అధినేత చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి నేటికి 30 ఏళ్లు పూర్త య్యాయి. ఇంత సుదీర్ఘ రాజకీయం జీవితం ఎవరికీ లేదా? అంటే.. చాలా మందికి ఉంది. కానీ, ఇంత సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. కూడా నవనవోన్మేషంగా ముందుకు సాగడం మాత్రం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమవుతోంది. వాస్తవానికి ఆయన ఆరోగ్యం పరంగా ఇబ్బందులున్నాయి. అయినా.. ఎక్కడా వాటిని లెక్కచేయరు. ప్రజలు-రాష్ట్రం అంటూ.. పరుగులు పెడతారు.. తోటి వారిని పెట్టిస్తారు కూడా!. ఆయన పరుగు పెట్టలేక పక్కకు తప్పుకొన్న వారు ఉన్నారే తప్ప.. బాబు పరుగు ఆగిన పరిస్థితి లేదు.
ఇక, రాజకీయాల్లో ఉన్న వారిపై నిందలు, అనుమానాలు.. అపోహలు కామన్‌గా వస్తుంటాయి. అవి ప్రత్యర్థుల సృష్టి కావొచ్చు.. లేదా.. కొన్ని యాదృచ్ఛికంగా జరిగే ప్రచాచాలు కావొచ్చు. ఇలానే చంద్రబాబుపై ప్రధానంగా మూడు నిందలు ఉన్నాయి. మరి వాటిలో నిజం ఎంత? వాస్తవానికి విజనరీ లీడర్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన చంద్రబాబు తప్పులు చేశారా? అనేది చర్చనీయాంశం. వీటిలో ప్రధానంగా పార్టీని మామ గారి నుంచి లాక్కున్నారన్నది ప్రధాన ఆరోపణ. వెన్ను పోటు పొడిచారన్నది ప్రధాన విమర్శ.
వాస్తవానికి.. ఒక పార్టీని లాక్కుని.. ఎవరైనా సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తే.. చేయొచ్చు. కానీ, తదుపరి ప్రజలు దానిని ఆమోదించాలి.. హర్షించాలి. ఈ విషయంలో చంద్రబాబు లాక్కోలేదు. నాటి పరిస్థితుల కారణంగా.. పార్టీలో వచ్చిన చీలికను ఏకం చేసి.. తాను నాయకత్వం వహించడం ద్వారా.. టీడీపీని నిలబెట్టారు. అదేసమయంలో నందమూరి కుటుంబానికి ఆయన వ్యతిరేకం కాదు. వారికి కూడా పదవులు ఇచ్చారు. పక్కన కూర్చోబెట్టుకున్నారు. కాబట్టి.. చంద్రబాబు తప్పు చేశారని ప్రజలే చెప్పలేదు.
ఇక, 2) రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రెండెకరాలే ఉన్నాయని.. ఇప్పుడు లక్ష కోట్ల కు ఎదిగారన్న విమర్శ కూడా చంద్రబాబుపై ఉంది. వాస్తవానికి ఇది కూడా శుద్ధ తప్పు. ఆయన రాజకీయంగా సంపాయించుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వలేదు. వ్యాపార పరంగా ముందుకు సాగారు. వాటిని డెవలప్ చేసుకున్నారు. దీనిపై మాత్రం ఎవరూ స్పందించరు. ఇక, మూడోది.. పొత్తులతో తప్ప..చంద్రబాబు పైకి రాలేదని. ఇది రాజకీయంగా అందరూ చేసేదే. దీనిని తప్పుబట్టాల్సిన అవసరం లేదు. ప్రజలకు మేలు చేయాలని అనుకున్నప్పుడు.. అనుకూలంగా ఉన్న అన్ని మార్గాలను వినియోగించుకోవడం తప్పుకాదు. సో.. ఈ నిందలు.. అపవాదులు కేవలం చర్చకు తప్ప.. భానుడు వంటి బాబు ముందు.. నిలబడేవి కాదన్నది అనేక మంది చెప్పిన మాట. చెబుతున్న మాట కూడా.
Gulte Telugu Telugu Political and Movie News Updates