Political News

కెనడా పీఎం పదవికి భారతీయుల పేర్లు?

కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. లిబరల్ పార్టీకి చెందిన 153 మంది ఎంపీల్లో 131 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పార్టీలో అంతర్గత విభేదాలు రగలడంతో ట్రూడో రాజీనామా చేయడం అనివార్యమైంది. ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఈ పరిణామం కెనడాలో కొత్త నాయకత్వంపై చర్చకు దారితీసింది.

ట్రూడో రాజీనామా తర్వాత, లిబరల్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రేసులో ఇద్దరు భారతీయ సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అనితా ఆనంద్, మరొకరు జార్జ్ చాహల్. అనితా ఆనంద్ ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు, పంజాబ్‌కు చెందిన భారతీయ వైద్య దంపతుల కుమార్తె అయిన ఆమె, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలక భూమిక పోషించారు. లిబరల్ పార్టీకి ఆమె నాయకత్వం వహించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.

మరోవైపు, సిక్కు కమ్యూనిటీలో ప్రభావం కలిగిన నేత జార్జ్ చాహల్ పేరు కూడా ప్రధానమంత్రి రేసులో ఉంది. అల్బెర్టాకు చెందిన ఆయన నేచురల్ రీసోర్సెస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. లిబరల్ పార్టీ తాత్కాలిక నాయకుడిగా చాహల్ నియమితులయ్యారు. కానీ కెనడా చట్టాల ప్రకారం తాత్కాలిక నాయకులు ప్రధానమంత్రి పదవి చేపట్టలేరని స్పష్టం కావడంతో చాహల్ ప్రధానమంత్రి పట్టు సాధించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

జస్టిన్ ట్రూడో తర్వాతి వారసుడిపై నిశ్చితి కాస్త సమయం పట్టొచ్చు. అనితా ఆనంద్ వంటి అనుభవజ్ఞుల నాయకత్వాన్ని భావించాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాలతో కెనడా ప్రజలు, అంతర్జాతీయ సమాజం కూడా కొత్త నాయకుడి వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

This post was last modified on January 7, 2025 12:08 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

విజయ్ దేవరకొండ 14 కోసం క్రేజీ సంగీత జంట

హిట్లు ఫ్లాపులు పక్కనపెడితే విజయ్ దేవరకొండ నిర్మాతలు బడ్జెట్ విషయంలో రాజీ పడకుండా భారీ ప్యాన్ ఇండియా సినిమాలు తీస్తున్నారు.…

3 hours ago

అదనపు 20 నిమిషాలతో రీ లోడ్… 2000 కోట్ల టార్గెట్??

పది రోజుల క్రితం వచ్చిన లీక్ నిజమయ్యింది. పుష్ప 2 ది రూల్ కు అదనంగా 20 నిమిషాల ఫుటేజ్…

3 hours ago

బాలయ్యకి జై లవకుశ చాలా ఇష్టం – బాబీ

ఇటీవలే స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అన్ స్టాపబుల్ 4 డాకు మహారాజ్ ఎపిసోడ్ లో బాలయ్య దర్శకుడు బాబీతో జరిపిన సంభాషణలో…

3 hours ago

మనకి గేమ్ ఛేంజర్ ఉంది తాతయ్య : దిల్ రాజుకి మనవడి కాల్

ఒకప్పుడు టాలీవుడ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్లలో ఒకడిగా ఉండేవాడు దిల్ రాజు. ప్రతి సినిమాతో హిట్టు కొట్టడం ఎవరికీ…

4 hours ago

హైదరాబాద్ లో బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల ఘర్షణ

త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే అక్కడి రోడ్లను ప్రియాంకా గాంధీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ బీజేపీ…

6 hours ago