Movie News

జూలై నెల… క్వాలిటీతో కాంపిటీషన్

జూన్ సగం అయిపోయింది. మా ఇంటి బంగారం లాంటి నోటెడ్ మూవీస్ తో పాటు దీవానా లాంటివి అంతో ఇంతో సౌండ్ చేయడానికి ప్రయత్నిస్తూ ప్రమోషన్ల మీద దృష్టి పెట్టాయి. నెలాఖరులో రావాల్సిన లెనిన్ వాయిదా పడటం దాదాపు కన్ఫర్మ్. కాకపోతే ఆ స్లాట్ ఎవరు తీసుకుంటారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. తక్కువ టైం కాబట్టి ఇప్పటికిప్పుడు ఆ తేదీని లాక్ చేసుకునేందుకు చెప్పుకోదగ్గ సినిమాలేవీ పరుగులు పెట్టకపోవచ్చు. ఖాళీగా వదిలిస్తే వృధా అవుతుంది.

ఇక జూలై విషయానికి వస్తే ఈసారి క్వాలిటీతో పోటీ పడుతున్న చిత్రాల జాబితా ప్రేక్షకుల్లో ఆసక్తి రేపేలా ఉంది. సత్యదేవ్ జూలై 3 విడుదల కానున్న తన ‘రావు బహద్దూర్’ని ఏకంగా ఆర్ఆర్ఆర్, బాహుబలితో పోల్చడం చూస్తుంటే మాములు కాన్ఫిడెన్స్ అనిపించడం లేదు. టీమ్ మొత్తం అదే నమ్మకాన్ని వ్యక్తం చేస్తోంది. టీజర్ దానికి తగ్గట్టే చాలా వెరైటీగా అనిపించింది. ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘నాగబంధం’ని భారీ ఎత్తున ప్రమోట్ చేసేందుకు దర్శకుడు అభిషేక్ నామా ప్రణాళిక సిధ్దం చేసుకున్నారు.

హీరోకి ప్రత్యేకంగా మార్కెట్, ఇమేజ్ లేనప్పటికీ విజువల్స్ చూస్తుంటే ఇదేదో ఆషామాషీ విఎఫెక్స్ మూవీలా అనిపించడం లేదు. దిల్ రాజు లాంటి బయ్యర్లు హక్కులు కొనడం చూస్తే క్రేజీ కంటెంటే అనిపిస్తోంది. ఘట్టమనేని జయకృష్ణని లాంచ్ చేస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’ని జూలై 9 విడుదలకు రెడీ చేస్తున్నారు. ఆరెక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ లవ్ యాక్షన్ డ్రామాలో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రత్యేక పాత్ర పోషించారు.

జూలై 10 ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ‘ఎపిక్’ విడుదల చేసే ప్లానింగ్ జరుగుతోంది. ఒకవేళ ఆ డేట్ సాధ్యం కాకపోతే వారం ముందుకు వెళ్లి జూలై 17 తీసుకొస్తారు. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ ఫేమ్ ఆదిత్య హాసన్ దర్శకత్వం వహించారు. జూలై 24 కిరణ్ అబ్బవరం ‘చెన్నై లవ్ స్టోరీ’ని దించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయట. కన్ఫర్మ్ చేయలేదు కానీ దాదాపు పక్కానే. జూన్ నుంచి తప్పుకున్న లెనిన్ కూడా జూలైలో వస్తే ఇక్కడ చెప్పిన ఎవరో ఒకరితో కాంపిటీషన్ తప్పదు.

This post was last modified on June 13, 2026 10:28 am

Share

Recent Posts

చిరంజీవి చూపు ఎవరి మీద ఉంది

కాకా షూటింగ్ పరుగులు పెడుతోంది. నవంబర్ చివరిలోపు దర్శకుడు బాబీ కొల్లి గుమ్మడికాయ కొట్టేలా ఉన్నాడు. తమన్ ఫస్టాఫ్ రీ…

4 hours ago

ట్రంప్‌.. ప్ర‌జాద‌ర‌ణ ఢ‌మాల్‌.. దేశ చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైమ్‌!

అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రజాదరణ రేటింగ్ ఒక్క‌సారిగా ప‌డిపోయింది. వాస్త‌వానికి గ‌త ఏడాదే ఆయ‌న ప్ర‌జాద‌ర‌ణ త‌గ్గుముఖం…

4 hours ago

రాజమౌళి రాజసానికి 25 సంవత్సరాలు

టాలీవుడ్ పుట్టినప్పటి నుంచి ఎందరో లెజెండరీ దర్శకులను ఇచ్చింది. చరిత్రలో ఎప్పటికీ చెప్పుకునే గొప్పవాళ్లను ప్రపంచానికి పరిచయం చేసింది. కెవి…

6 hours ago

రాజమౌళిని ఫాలో అవుతున్న రణబాలి

సినిమా లవర్స్‌కు సినిమా తెర వెనుక సంగతుల మీద కూడా అమితాసక్తి ఉంటుంది. ఘనవిజయం సాధించిన సినిమాలకు సంబంధించి మేకింగ్…

6 hours ago

దాదాకున్న సమయం తక్కువే కానీ

నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న దాదా షూటింగ్ ఇంకా రీ స్టార్ట్ కాలేదు. బాలయ్య ఇప్పుడిప్పుడే…

6 hours ago

రణబాలి… దర్శకుడి క్లారిటీ సూపర్

ఈ రోజుల్లో చెప్పిన రిలీజ్ డేట్‌కు సినిమాను రిలీజ్ చేసే ఫిలిం మేకర్స్ బాగా తగ్గిపోయారు. కాస్త పేరున్న సినిమా…

8 hours ago