2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయం పక్కా అని భావించిన వైసీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అంతే అప్పటిదాకా ఓ రేంజిలో ధీమా చూపించిన వైసీపీ శ్రేణులంతా గప్ చుప్ అయిపోయాయి. ఆపై కొంతకాలం పాటు సైలెంట్ గానే ఉన్న వైసీపీ శ్రేణులు…తమ పరాజయానికి కారణమేమిటన్న దానిపై బాగానే ఆలోచించాయి. ఈ సందర్భంగా తమ పరాజయం కంటే కూటమి పార్టీల గెలుపునకు కారణమేమిటన్న దానిపైనే వైసీపీ నేతలంతా దృష్టి సారించినట్లున్నారు.
లోకేశ్ నోట వినిపించిన రెడ్ బుక్ కూటమికి విజయం కట్టబెట్టిందని ఓ తీర్మానానికి వచ్చిన వైసీపీ నేతలు… ఇప్పుడు లోకేష్ బాటలోనే నడుస్తున్నారు. అయితే లోకేశ్ ఓ క్రమ పద్ధతిలో రెడ్ బుక్ ను వాడితే.. వైసీపీ మాత్రం దాని అర్థాన్నే మార్చేశాయి. వెరసి వైసీపీ నోట బెదిరింపులు తప్పించి మరో మాట వినిపించడం లేదు. వెరసి ఇలాగైతే ఇక వైసీపీ గెలిచినట్టే… జగన్ మరోమారు సీఎం అయినట్టేనన్న సెటైర్లు పడిపోతున్నాయి.
ఈ క్రమంలో భాగంగానే ఇప్పుడు వైసీపీ కీలక నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో చేసిన తాజా వ్యాఖ్యలు కలకలమే రేపుతున్నాయి. ఓ రాజకీయ నాయకుడు మంచి చేయకున్నా ఫర్వా లేదు గానీ… సమాజంలో అశాంతి రేకెత్తేలా ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయరాదని ఆయన మాటలు విన్నవారంతా చెబుతున్నారు. అయినా మహేశ్ రెడ్డి నోట నుంచి వచ్చిన మాటలు జగన్ పతనానికి దారి తీసేలా ఉన్నాయి గానీ… జగన్ ను ఈ వ్యాఖ్యలు మరోమారు సీఎంగా ఎలా చేస్తాయన్న విశ్లేషణలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
అయినా ఈ సమావేశంలో మహేశ్ రెడ్డి ఏమన్నారన్న విషయానికి వస్తే… వైసీపీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని చెప్పారు. మనం మళ్లీ అదికారంలోకి వస్తున్నామని ఆయన తెలిపారు. ఈసారి అధికారంలోకి వస్తే మునుపటిలా పరిస్థితి ఉండదని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలలు అభివృద్ధి అనే మాట ఉండదన్నారు. ఆ ఆరు నెలల పాటు పగ తీర్చుకోవడం మాత్రమే ఉంటుంది. ఆ తర్వాతే అభివృద్ది అయినా, ఇంకేదైనా? అని ఆయన తనదైన శైలిలో చెప్పుకుపోయారు.
కాసు మహేశ్ రెడ్డి ఓ మాజీ ముఖ్యమంత్రి మనవడు. ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన కాసు బ్రహ్మానందరెడ్డి మనవడు ఆయన. ఇక మహేశ్ రెడ్డి తండ్రి కాసు వెంకట కృష్ణారెడ్డి ఉమ్మడి ఏపీలో మంత్రిగా పనిచేశారు. ఈ లెక్కన మహేశ్ రెడ్డి చాలా పరిణతి కలిగిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినట్టే లెక్క. అయితే ఆయన నోట నుంచి వస్తున్న ఈ తరహా ఉద్రేకపూరిత వ్యాఖ్యలు చూస్తుంటే… కాసు ఫ్యామిలీలో ఇలాంటి నేత ఎలా వచ్చారన్న అనుమానం కలగక మానదు. ఈ తరహా ప్రసంగాలతో మహేశ్ రెడ్డి తన అనుచరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారన్న దానిపై పెద్ద చర్చే నడుస్తోంది.
This post was last modified on June 13, 2026 1:06 pm
ఒకవైపు కుండపోత వానలు, వరదలు.. ఎటు చూసినా నిండా మునిగిన పంట పొలాలు.. ఇళ్లల్లోకి చేరిన నీళ్లు.. అయినా సరే…
అగ్రరాజ్యం అమెరికాలో త్వరలోనే మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. మన దేశంలో మాదిరిగా ఐదేళ్లకు ఒకసారి ఎన్నికలు అక్కడ జరగవు. నాలుగేళ్లకు…
ఒక్క చిన్న క్లాజ్... ఒక మహిళకు ఉపశమనం కలిగించగా.. మరో అధికారికి 2 లక్షల రూపాయల పెనాల్టీ విధించేలా చేసింది.…
ఇప్పుడు సినీ పరిశ్రమలో స్టార్లుగా చలామణి అవుతున్న చాలామంది ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డవాళ్లే. ఇంటర్వ్యూల్లో వారిని కదిపితే.. ఒకప్పటి…
నటుడు శివాజీ డిమాండ్ ఈ మధ్య బాగా పెరిగిపోయింది. 90స్ మిడిల్ క్లాస్ బయోపిక్ నుంచి మొన్న లెనిన్ దాకా…
నటి జత్వానీ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న సీనియర్ ఐపీఎస్ అధికారులు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాలపై ఉన్న సస్పెన్షన్‌ను…