ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వహణలో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ మాజీ మంత్రి కేటీఆర్ పై ఏసీబీ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆ కేసు కొట్టివేయాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కు హైకోర్టు షాకిచ్చింది. ఆ క్వాష్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
దాంతోపాటు కేటీఆర్ అరెస్ట్‌పై ఇప్పటివరకు ఉన్న స్టే కూడా హైకోర్టు ఎత్తివేసింది. అయితే, ఈ తీర్పుపై కేటీఆర్ సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.తాజాగా హైకోర్టు తీర్పుతో ఏసీబీ అధికారులు స్పీడు పెంచనున్నారు. నిన్న విచారణకు వచ్చి వెనుదిరిగిన కేటీఆర్ కు మరోసారి విచారణకు రావాలని ఏసీబీ ఆల్రెడీ నోటీసులు జారీ చేసింది.
తాజాగా క్వాష్ పిటిషన్ కొట్టివేయడంతో మరోసారి కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చేందుకు ఏసీబీ అధికారులు రెడీ అవుతున్నారు. మరోవైపు, ఈ రోజు అదే కేసులో ఈడీ విచారణకు కేటీఆర్ హాజరు కావాల్సి ఉంది.
అయితే, కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రోజు హాజరు కాలేనని కేటీఆర్ చెప్పడంతో అందుకు ఈడీ అంగీకరించింది. అయితే, తాజాగా తీర్పు నేపథ్యంలో ఈడీ కూడా త్వరలోనే కేటీఆర్ ను విచారణ జరిపేందుకు రంగం సిద్ధం చేస్తోంది
This post was last modified on January 7, 2025 12:16 pm
అతడి వయసు 35 ఏళ్ల కంటే తక్కువే. అయితే.. టెక్నాలజీ మీద తనకున్న పట్టుతో ఈ భారత సంతతికి చెందిన…
సోషల్ మీడియా, సినిమా సెలబ్రిటీలను బాగా ఫాలో అయ్యేవాళ్ళకు పరిచయం అక్కర్లేని పేరు వామికా గబ్బి. ఇటీవలే వరుణ్ ధావన్…
మన దేశంలో నేరం చేసిన కొందరు వ్యక్తులు ఎంచక్కా విదేశాలకు పారిపోయి తలదాచుకుంటున్నారు. అలా విదేశాలకు పారిపోయిన నేరగాళ్లలను ట్రాక్…
ఒకప్పుడు రవి ఆస్తమించని బ్రిటన్ సామ్రాజ్యంగా పేరున్న ఇప్పటి గ్రేట్ బ్రిటన్.. తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. ప్రపంచ రాజకీయాల్లో ఇప్పటివరకు…
బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ ట్రైలర్ చూశాక అందరికీ వచ్చిన సందేహం ఒకటే. ఇంత గ్రాండ్…
పదేళ్ల ముందు బాహుబలి ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ రికార్డులన్నింటినీ బద్దలు కొట్టేసినపుడు తెలుగు సినీ ప్రియులు ఎంతగానో సంబరాలు చేసుకున్నారు.…