Movie News

నయనతార దైవమైతే మరి పూజా హెగ్డే ?

దర్శకుడు లారెన్స్ రాఘవేంద్ర హీరోగా ఆయన డైరెక్షన్లోనే రూపొందుతున్న కాంచన 4 షూటింగ్ కీలక దశకు చేరుకుంది. ఇందులో ముఖ్యమైన స్పెషల్ రోల్ కు నయనతారను సంప్రదించాడనే వార్త చెన్నై వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆల్రెడీ పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ కాగా ఇంకో ముఖ్యమైన క్యారెక్టర్ నోరా ఫతేహి చేస్తోంది. అలాంటప్పుడు నయన్ కు స్కోప్ ఎక్కడ ఉందనేది సస్పెన్స్ గా మారింది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం దానికి సమాధానం ఇలా ఉంది.

కాంచన 4లో పూజా హెగ్డే పాత్రకు దెయ్యం ఛాయలు ఉంటాయట. అంటే కథ ప్రకారం లారెన్స్ సినిమాల్లో రెగ్యులర్ గా ఒక హీరోయిన్ కి పట్టే ఆత్మ ఇందులో పూజని వరిస్తుందట. ఈ క్రమంలో వచ్చే పెర్ఫార్మన్స్ పీక్స్ లో ఉంటుందని యూనిట్ టాక్. నోరా ఫతేహికి నెగటివ్ టచ్ ఇచ్చారని వినికిడి. ఇక నయనతారని కోడిరామకృష్ణ అమ్మోరు క్లైమాక్స్ లా ఫుల్ గూస్ బంప్స్ వచ్చే తరహాలో లారెన్స్ డిజైన్ చేసుకున్నాడని టాక్. నిజమెంతో టీజరో ట్రైలరో వచ్చాక క్లారిటీగా అర్థమవుతుంది.

ఇంకా విడుదల తేదీ ఖరారు కాని కాంచన 4ని ఈ ఏడాది రిలీజ్ చేయాలని లారెన్స్ ఫిక్స్ అయ్యాడు. బిజినెస్ ఆఫర్స్ క్రేజీగా ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు వెర్షన్ కు భారీ రేట్ పలకొచ్చట. ముని నుంచి ఇప్పటిదాకా ఈ సిరీస్ లో వచ్చినవన్నీ ఏపీ తెలంగాణలో కమర్షియల్ గా సూపర్ సక్సెస్ అయ్యాయి. కాంచన 3కి నెగటివ్ రివ్యూలు,టాక్ వచ్చినా జనం చూశారు. మొదటి వారం రోజులు మెయిన్ సెంటర్స్ అన్నీ హౌస్ ఫుల్ అయ్యే రేంజ్ లో ఆ బొమ్మ ఆడింది.

ఇప్పుడు కాంచన 4కి మరో అడ్వాంటేజ్ ఉంటుంది. దేవుళ్ళు దేవతలను ఆధారంగా చేసుకుని వస్తున్న సినిమాలు మంచి ఆదరణ దక్కించుకుంటున్నాయి. వీరభద్రుడులో ఎన్ని లోపాలు, తప్పులు ఉన్నా డివోషనల్ ఎలిమెంట్ జనాలకు బాగా కనెక్ట్ అయిపోయింది. అందుకే నెల రోజుల తర్వాత కూడా తమిళనాడులో థియేటర్ రన్ బలంగా ఉంది. అలాంటివి కాంచన 4లో చాలా ఉన్నాయట. అందుకే నయన్ ఎంట్రీ చేస్తోందని వినికిడి. చూడాలి లారెన్స్ ఇంకేమేం వండుతాడో.

This post was last modified on June 14, 2026 11:38 am

Share

Recent Posts

సోషల్ మీడియాకి రియాక్ట్ అయితే ఎలా

సెలబ్రిటీలు సోషల్ మీడియాకు స్పందించే విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిందే. ఏ మాత్రం టెంప్ట్ అయినా దాని పరిణామాలు అనవసరమైన అపార్థాలకు…

46 minutes ago

చైనా అధ్యక్షుడి కోసం ప్రోటోకాల్ బ్రేక్ చేసిన ట్రంప్

దగ్గరదగ్గర పది.. పన్నెండు రోజుల క్రితం ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో చైనా అధినేత షీ జిన్ పింగ్…

60 minutes ago

హౌస్ హాజ్బెండ్… ఇక మామూలే…

మీ ఆవిడ ఏమి చేస్తుంటారు అని ఎవరైనా అడిగితే హౌస్ వైఫ్ అని సమాధానం చెప్పడం ఇప్పటి వరకు మనం…

1 hour ago

నాని సామర్ధ్యం… డౌట్లు అక్కర్లేదు

నిన్న విడుదలైన ది ప్యారడైజ్ ఊహించని స్థాయిలో అతి పెద్ద ఓపెనింగ్ దక్కించుకుంది. నిర్మాణ సంస్థ అధికారికంగా చెబుతున్న దాని…

1 hour ago

శ్రీవిష్ణుకి ఫేవరేట్ హీరోతోనే పోటీ

టాలీవుడ్ రిలీజుల వ్యవహారం కేవలం ప్యాన్ ఇండియాలకే కాదు మీడియం సినిమాలకు సైతం ప్రాణ సంకటంగా మారింది. అక్టోబర్ 2…

2 hours ago

ఐబొమ్మ ర‌వికి ఒక గుడ్ న్యూస్… ఒక బ్యాడ్ న్యూస్

పైర‌సీ వెబ్ సైట్ తో తెలుగు.. త‌మిళం.. హిందీ.. ఇంగ్లిషు..ఆ భాష.. ఈ భాష అన్న తేడా లేకుండా సినిమాలు…

6 hours ago