పెద్ది విషయంలో ప్రీ రిలీజ్ నుంచి పోస్ట్ రిలీజ్ దాకా జరుగుతున్న ఒక పొరపాటు సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు దారి తీస్తోంది. అదే దంగల్ తో పోలిక. విడుదలకు ముందు రామ్ చరణ్ ఢిల్లీ, ముంబై ఈవెంట్స్ లో మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ సుల్తాన్, అమీర్ ఖాన్ దంగల్ లాంటివి తనకు స్ఫూర్తినిచ్చాయని చెప్పాడు. సంతోషం. నార్త్ ఆడియన్స్ దృష్టిలో పడేందుకు ఇలాంటివి అవసరమే. కానీ కంటెంట్ పరంగా పోల్చుకోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేదనేది గుర్తించాలి.
తాజాగా పెద్ది టీమ్ ని అభినందిస్తూ చిరంజీవి ఒక పాతిక నిమిషాల ఇంటర్వ్యూ చేశారు. దర్శకుడు బుచ్చిబాబు, నిర్మాత వెంకట సతీష్ కిలారుతో పాటు కీలక సభ్యులు అందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెగాస్టార్ దంగల్ ప్రస్తావన తెచ్చారు. అది ఫ్యామిలీ ఎమోషన్స్ మీద ఆధారపడిందని, కానీ పెద్దిలో ఊరి కోసం దేశం కోసం పడే తాపత్రయం ఉందని, అందుకే దీనికి లాంగెటివిటీ ( సుదీర్ఘ థియేటర్ రన్) ఉంటుందని చెప్పారు. కానీ ఇక్కడో లాజిక్ మిస్ అయ్యింది.
దంగల్ ప్రాథమికంగా మొదలయ్యేది ఫ్యామిలీ కోణంలోనే అయినప్పటికీ క్రమంగా అది అమ్మాయిల సాధికారికత, దేశానికి మెడల్స్ తేవడంలో వాళ్ళు చూపించాల్సిన తెగువ లాంటి వాటిని గొప్పగా టచ్ చేస్తుంది. స్ఫూర్తి చెందడానికి బోలెడు ఉంటుంది. అమీర్ ఖాన్ తో సమానంగా ఇద్దరు అమ్మాయిల పాత్రలు గుర్తింపు తెచ్చుకున్నాయి. కుస్తీ అనే పాయింట్ పక్కనపెడితే పెద్ది, దంగల్ మధ్య చాలా అంటే చాలా వ్యత్యాసం ఉంది. పెద్దిలో లవ్ స్టోరీ, క్రికెట్, పరుగు పందెం లాంటి ఇతరత్రా అంశాలు ఉంటాయి.
వీలైనంత వరకు దంగల్ లాంటివి డిస్కషన్ లోకి తేకపోవడం ఉత్తమం. మరొక విషయం ఏంటంటే దంగల్ చైనాలో కూడా భీకరంగా ఆడి వేల కోట్లు వసూలు చేసింది. పెద్దికి అలాంటి ఛాన్స్ ఉందా ఉంటే ఔననీ చెప్పలేం. పైగా ఇందులో కూడా జగపతిబాబు చనిపోయాక ఊరికి గుర్తింపు తేవాలని చరణ్ పోరాటం చేస్తాడు కానీ దేశానికి ఏదో చేయాలని కాదు. దంగల్ హీరో కుటుంబం కోసం చేస్తాడు..ఈ యాంగిల్ లో దంగల్, పెద్దిలో ఒక సారూప్యత అయితే ఉంది. ఇదంతా ఎక్స్, ఇన్స్ టాలో లేనిపోని చర్చకు దారి తీస్తోంది.
This post was last modified on June 14, 2026 12:55 pm
తెలుగులో అసలే పేరే లేకుండా రిలీజైన సినిమా ఒకటుంది. జేడీ చక్రవర్తి నటించిన ఆ చిత్రానికి రిలీజ్ తర్వాత ‘పాపే…
ఈత రాదు.. చేతులకు గ్లౌజులు లేవు.. కాళ్లకు బూట్లు కూడా లేవు. అయినా నదిలోకి దిగాడు. ప్లాస్టిక్, చెత్తతో కలుషితమైన…
ఈ రోజుల్లో ఏదైనా పెద్ద సినిమా మొదట ప్రకటించిన డేటుకు రిలీజైతే ఆశ్చర్యపోయే పరిస్థితి ఉంటోంది. ఎంత ప్రణాళికాబద్ధంగా షూటింగ్…
బహుముఖ ప్రజ్ఞాశాలి అడివి శేష్ నుంచి ఒక సినిమా వస్తోందంటే.. ప్రేక్షకుల్లో దానిపై మంచి అంచనాలుంటాయి. ఈ వేసవిలో ‘డెకాయిట్’…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తెలంగాణా అధికార కాంగ్రెస్లో పరిస్థితి నూటెనిమిది డిగ్రీల సెల్సియస్ దాటింది. కొండా సురేఖ…
మంచి సినిమా తీశాం అన్న ధీమా కావచ్చు. లేదంటే సినిమాను ఎలాగోలా జనాల్లోకి తీసుకెళ్లాలి అనే డెస్పరేషన్ కావచ్చు. ఈ…