కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో తన పదవికి రాజీనామా చేయడంతో అక్కడ రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారాయి. లిబరల్ పార్టీకి చెందిన 153 మంది ఎంపీల్లో 131 మంది ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేయడం, పార్టీలో అంతర్గత విభేదాలు రగలడంతో ట్రూడో రాజీనామా చేయడం అనివార్యమైంది. ఆయన సోమవారం తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించగా, ఈ పరిణామం కెనడాలో కొత్త నాయకత్వంపై చర్చకు దారితీసింది.
ట్రూడో రాజీనామా తర్వాత, లిబరల్ పార్టీ నూతన నాయకుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ రేసులో ఇద్దరు భారతీయ సంతతి నేతల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు అనితా ఆనంద్, మరొకరు జార్జ్ చాహల్. అనితా ఆనంద్ ప్రస్తుతం రవాణా, అంతర్గత వాణిజ్య మంత్రిగా వ్యవహరిస్తున్నారు. తమిళనాడు, పంజాబ్‌కు చెందిన భారతీయ వైద్య దంపతుల కుమార్తె అయిన ఆమె, కోవిడ్-19 మహమ్మారి సమయంలో కీలక భూమిక పోషించారు. లిబరల్ పార్టీకి ఆమె నాయకత్వం వహించే అవకాశాలపై చర్చలు జరుగుతున్నాయి.
మరోవైపు, సిక్కు కమ్యూనిటీలో ప్రభావం కలిగిన నేత జార్జ్ చాహల్ పేరు కూడా ప్రధానమంత్రి రేసులో ఉంది. అల్బెర్టాకు చెందిన ఆయన నేచురల్ రీసోర్సెస్ స్టాండింగ్ కమిటీకి చైర్మన్‌గా ఉన్నారు. లిబరల్ పార్టీ తాత్కాలిక నాయకుడిగా చాహల్ నియమితులయ్యారు. కానీ కెనడా చట్టాల ప్రకారం తాత్కాలిక నాయకులు ప్రధానమంత్రి పదవి చేపట్టలేరని స్పష్టం కావడంతో చాహల్ ప్రధానమంత్రి పట్టు సాధించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.
జస్టిన్ ట్రూడో తర్వాతి వారసుడిపై నిశ్చితి కాస్త సమయం పట్టొచ్చు. అనితా ఆనంద్ వంటి అనుభవజ్ఞుల నాయకత్వాన్ని భావించాలనే అభిప్రాయం ఎక్కువగా వినిపిస్తోంది. మారుతున్న రాజకీయ పరిణామాలతో కెనడా ప్రజలు, అంతర్జాతీయ సమాజం కూడా కొత్త నాయకుడి వైపు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates