ప్రపంచంలోని మూర్ఖ పాలకుల జాబితాను తీస్తే.. అందులో మొదటి ముగ్గురు పాలకుల్లో ఒకరుగా నిలుస్తారు కింగ్ జోంగ్ ఉన్. తన దేశంలోని ప్రజల్ని మరబొమ్ములుగా చేసి.. వారిని తన కబంధ హస్తాల్లో బంధించి.. నోరెత్తితే ప్రాణాలు తీసేందుకు ఏ మాత్రం వెనుకాడని కర్కశత్వం కిమ్ సొంతం. అలాంటి ఆయన రాజ్యంలో తాజాగా ఎన్నికలు జరగటం.. వాటి ఫలితాలు వెల్లడయ్యాయి. అసలే కిమ్ రాజ్యం. అందులో ఎన్నికలు. ఫలితాల గురించి మరింత ఎక్కువ అంచనాలకు పోవటం అత్యాశే అవుతుంది.
ఈ వాదనకు తగ్గట్లే.. అక్కడి ఎన్నికల ఫలితాలు ఉన్నాయి. కిమ్ నాయకత్వంలోని అధికార వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా పార్టీ ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. ఏకంగా 99.93 శాతం ఓట్లతో పోటీ చేసిన 687 స్థానాల్లో గెలిచి.. తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. కిమ్ పార్టీకి కేవలం 0.07 శాతం మాత్రమే వ్యతిరేక ఓట్లు పోల్ కావటం విశేషం. ఇదంతా చూస్తే.. ఉత్తరకొరియా ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఎన్నికల్లో కిమ్ పార్టీ తరఫున పోటీ చేసిన అభ్యర్థుల్లో 70 శాతం కొత్త వారే.
గెలిచిన నేతల్లో కిమ్ సోదరి కిమ్ యో జోంగ్ కూడా ఉన్నారు. కిమ్ కు అత్యంత నమ్మకస్తుడు.. సన్నిహితుడైన జో యోంగ్ వోన్ కు కీలక పార్లమెంటరీ పదవి దక్కే వీలుందని చెబుతున్నారు. ఈ గెలుపు నేపథ్యంలో దక్షిణ కొరియాతో సంబంధాలను శత్రుత్వంగా నిర్వచించే రాజ్యాంగ సవరణ చేస్తారన్న అంచనా వ్యక్తమవుతోంది.
ఉత్తర కొరియాలో ఎన్నికల ప్రక్రియ మొత్తం కిమ్ కనుసన్నల్లో నడుస్తుంది. ప్రతి నియోజకవర్గంలో బరిలో ఉండే అభ్యర్థి ఒక్కరే ఉండటం.. ఎవరూ పోటీకి ముందుకు రావటం.. పోలింగ్ జరిగినప్పుడు ఓటు వేసే ఓటరు రిస్కు తీసుకోడు కదా? అందుకే.. అభ్యర్థిని తిరస్కరించే అవకాశం ఉండదు.
దీనికి తోడు ఓటింగ్ బహిరంగంగా ఉంటుంది కాబట్టి వ్యతిరేకంగా ఓటు వేసే ధైర్యం ఎవరికి ఉండదు. ఒకవేళ.. వేసినా ఆ తర్వాతి ఫలితాలు ప్రమాదకంగా మారతాయి. అందుకే.. ఎవరికి వారు ఎలా ఓటు వేస్తే.. తమ బతుకులు ప్రమాదానికి గురి కాకుండా ఉంటాయో.. అందుకు తగ్గట్లే ఓటేయటం ఆ దేశ ప్రజలకు అలవాటు. తాజా ఎన్నికల పలితాలు కిమ్ ఏ స్థాయి నియంత..తన వ్యతిరేకుల విషయంలో అతడెంత కర్కశంగా వ్యవహరిస్తారన్న దానికి నిదర్శనంగా తాజా ఎన్నికల ఫలితాలు చెప్పేస్తాయని చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
