విశాఖలో 500 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చుపెట్టి రుషికొండ ప్యాలెస్ కట్టిన జగన్ పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. ఆ ప్యాలెస్ కట్టిన జగన్ ను జీవితాంతం జైలులో పెట్టినా తప్పు లేదని ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి శాసన సభలో జగన్ పై విష్ణుకుమార్ రాజు పదుునైన విమర్శలతో విరుచుకుపడ్డారు.
ఈ భూమి మీద జగన్ ఉన్నంత కాలం ఏపీ నాశనం అవుతుందని విష్ణుకుమార్ రాజు చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కాంట్రాక్టర్ల జీవితాలను జగన్ సర్వనాశనం చేశారని ఆయన ధ్వజమెత్తారు. వైసీపీ హయాంలో చేసిన పనులకు డబ్బులు రాక, ఆ పనులు పూర్తి చేసేందుకు చేసిన అప్పులు చెల్లించలేక వారు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాంకుల ఒత్తిడి తట్టుకోలేక 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
1983 నుంచి తాను కాంట్రాక్టులు చేస్తున్నానని. దుర్మార్గమైన రాక్షస జగన్ ప్రభుత్వం దగ్గర మాత్రం పనులు చేయలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంట్రాక్టర్లను జగన్ పెట్టిన బాధలకు…తాను 10 సార్లు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చేదని షాకింగ్ కామెంట్లు చేశారు. జగన్ అసెంబ్లీకి ఎప్పుడు వస్తాడా? అని ఎదురు చూస్తున్నానని… ఆయనను అసెంబ్లీకి పిలిపించాలని స్పీకర్ ను కోరారు. 2019-24 మధ్య కాలంలో రాక్షస పాలన కొనసాగిందని విమర్శించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates