వైసీపీ అధినేత జగన్.. గుడ్ బుక్ పెట్టామని.. పార్టీలో నాయకులకు మంచి చేస్తామని.. బాగా కష్టపడుతు న్న వారికి ప్రమోషన్లు ఇస్తామని చెబుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ ‘గుడ్‌బుక్’పై తాజాగా బీజేపీ ఎమ్మెల్యే, మాజీ టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్నారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు.. ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సూచనలతో బీజేపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడారు.
“జగన్ గుడ్ బుక్.. గుడ్ బుక్.. అంటున్నాడు. తన సొంత తల్లి, చెల్లికే ‘గుడ్’ చేయని వాడు.. గుడ్‌బుక్‌తో పార్టీ నేతలకు ఏం మేలు చేస్తాడు” అని నల్లమిల్లి నిలదీశారు. జగన్ మెహన్ రెడ్డి చూస్తే ‘గుడ్ బుక్’ అంటూ జోకులు వేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పంచన చెరెందుకు జగన్ తహతహలాడు తున్నారని, తల్లికి చెల్లికి గుడ్ చేయని జగన్ ప్రజలకి ఏమి చేస్తాడని ప్రశ్నించారు.
“బాబాయ్ ని చంపిన తమ్ముడిని కాపాడుకున్న నరరూప రాక్షసుడు జగన్ ” అని నల్లమిల్లి నిప్పులు చెరిగారు. “బాబాయ్ ని చంపిన తమ్ముడిని కాపాడటం ‘గుడ్’ అనుకుంటున్నాడు. జగన్ గత పాలనలో ప్రజలకి ఏమి మంచి పనులు చేసాడు? గత ప్రభుత్వంలో రహదారులు ఎంత అద్వానంగా ఉన్నాయో ప్రజలందరూ గమనించారు. అందుకే ప్రజలు కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని అందించారు.” అని నల్లమిల్లి చెప్పుకొచ్చారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక ఏపీని అభివృద్ధి చేయటానికి కేంద్రం నిధులు కేటాయిస్తోందని నల్లమిల్లి తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రజలకి ఇచ్చిన హామీలని ఒక్కొక్కటిగా అమలు చేస్తుందన్నారు. ఇవన్నీ చూసి జగన్ బాధ పడుతున్నాడని ఎద్దేవా చేశారు. రైల్వే ప్రాజెక్ట్ లు, స్టీల్ ప్లాంట్ అభివృద్ధి కోసం ప్రణాళికలు, పోలవరం ప్రాజెక్ట్ కోసం కేంద్రం నిధులు విడుదల చేస్తుందని చెప్పారు. నవంబర్ నుంచి మార్చి లోపు పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణం పూర్తి చేయటానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates