తాజాగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, జగన్ సర్కారుకు కీలక సలహాదారుగా వ్యవహరించిన సజ్జల రామకృ ష్నారెడ్డి.. అందరు చెప్పినట్టే సమాధానాలు చెప్పారు. 2021, అక్టోబరు 19 నాడు జరిగిన టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మంగళగిరి పోలీసులు సజ్జలకు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తాజాగా మంగళగిరి స్టేషన్ సీఐ శ్రీనివాసరావు విచారించారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటలలోపు రావాలని పేర్కొన్నారు.
దీంతో సజ్జల మధ్యాహ్నం 3 గంటల సమయంలో స్టేషన్‌కు వచ్చారు. అది కూడా ఎవరికీ కనిపించకుండా అత్యంత రహస్యంగా స్టేషన్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఆయనకు 38 ప్రశ్నలు సంధించినట్టు పోలీసులు తెలిపారు. వీటిలో ప్రధానంగా అన్ని ప్రశ్నలకు సజ్జల దాటవేత ధోరణినే ప్రదర్శించినట్టు సీఐ శ్రీనివాస రావు వెల్లడించారు. “ఏ ప్రశ్న అడిగినా.. ఏమో-తెలీదు-గుర్తులేదు అనే ఆయన సమాధానం ఇచ్చారు” అని తెలిపారు. దీంతో ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్టు చెప్పారు.
ఇక, ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించిన నేపథ్యంలో ఇక నుంచి ఈ కేసును సీఐడీ పోలీసులే విచారిస్తారని.. సీఐ వివరించారు. తమకు అందిన సమాచారాన్ని సీఐడీ పోలీసులకు వెల్లడించను న్నామని అన్నారు. ప్రస్తుతం ఈ కేసులో చాలా మంది నిందితులు కోర్టు నుంచి రక్షణ పొందారని.. దీంతో వారిని విచారించడం కష్టంగా ఉందన్నారు.
సజ్జలకు సంధించిన ప్రధాన ప్రశ్నల్లో కొన్ని..
- 2021, అక్టోబరు 19న ఎక్కడున్నారు?
- టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినట్టు మీకు తెలుసా?
- టీడీపీ కార్యాలయంపై ఎంత మంది దాడి చేశారు?
- ఆఫీసుపై దాడి చేయాలన్న ఉద్దేశం ఎందుకు వచ్చింది?
- ఆఫీసుపై దాడి చేసిన వారి పేర్లు చెబుతాను.. గుర్తు పట్టగలరా?
- దాడి జరిగినప్పుడు.. తర్వాత.. మిమ్మల్ని ఎవరైనా కలుసుకున్నారా?
- దాడి జరిగిందని తెలిసిన తర్వాత.. మీరు పోలీసులకు సమాచారం ఇచ్చారా?
- టీడీపీ కార్యాలయంపై దాడి చేసినప్పుడు.. మీకు అందిన ఎవరు ముందుగా ఫోన్ చేశారు?
- మీకు తెలిసే దాడి జరిగిందన్న సమాచారం మాకు ఉంది.