రెడ్డిని పెట్టుకోండయ్యా.. ఆపలేకపోతున్నాం

నిజానికి ఒకప్పటి తెలుగు హీరోయిన్లు మాత్రం.. ఇతర బాషా హీరోయిన్లకు పోటాపోటీగా గ్లామర్ ట్రీట్ అందించేవారు. అప్పట్లో భానుప్రియ, తరువాత రంభ.. ఇలా చాలామంది తెలుగు స్టారీమణులు తమ అందచందాలతో అప్పటి యువతకు మత్తెక్కించారు. అయితే మోడ్రన్ టైమ్స్ వచ్చే సరికి.. టాలెంట్ ఉన్న చాలామంది భామలు గ్లామర్‌కు దూరంగానే ఉన్నారు. కొంతమందికి గ్లామర్ షోస్ ఓకె అయినా కూడా.. మరీ బాలీవుడ్‌లో దిశా పటాని, కియారా అద్వానీ రేంజ్‌లో అందాలను ఆరబోయడానికి మొహమాటమేనని చెప్పాలి. కాని ఒక్కమ్మాయ్ మాత్రం ఇప్పుడు అందర్నీ బీట్ చేస్తానంటోంది.

బిగ్ బాస్‌తో పాపులర్ అయిన టిక్ టాక్ స్టార్ అషు రెడ్డి.. ఇప్పుడు ఇనస్టాగ్రామ్‌ను తన అందచందాలతో నింపేస్తోంది. అసలు మన తెలుగులో ఒక స్థాయి ఎక్స్‌పోజింగ్ చేసే బ్యూటీలే లేరంటే.. అమ్మడు ఏకంగా లోదుస్తల్లో కూడా వీరవిహారం చేస్తోంది. దాదాపు ప్రతీరోజూ ఏదో ఒక కొత్త ఫోటోలతో తన గమ్మత్తయిన అందాలతో యువతను రెచ్చగొడుతోంది. ఒక ప్రక్కన బిగ్ బాస్ నుండి బయటకు వచ్చేశాక కేవలం టివిషోలే రావడం, సినిమాలు పెద్దగా రాకపోవడంతో.. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీని తనవైపు ఆకర్షించుకోవాలని అషు ఈ తరహాలో రెచ్చిపోతోందా అనే సందేహం కూడా వస్తోంది.

ఆమెను సినిమాల్లో పెట్టేసుకుంటే.. బాగుంటుందనేది చాలామంది అభిప్రాయం. కాకపోతే వెండితెరకు కావల్సినంత గ్లామర్ డోస్ ఆమె దగ్గర పుష్కలంగా ఉన్నా కూడా.. తెరపై ఆకట్టుకోవాలంటే అందంతో పాటు అభినయం కూడా కావాలి. ప్రస్తుతానికి ఆమెకు మాంచి అవకాశాలు రావాలంటే.. తనని తాను నటిగా ప్రూవ్ చేసుకునే పాత్ర ఏదైనా చేతిలోపడాలి. చూద్దాం ఆ అవకాశం ఎవరిస్తారో!!