లెనిన్ నుంచి ఇట్లు అర్జున దాకా నాగార్జున పలు సందర్భాల్లో టాలీవుడ్ దర్శక నిర్మాతలు పనులు వేగవంతం చేసుకోవడం గురించి సలహాలు, సూచనలు ఇస్తూనే ఉన్నారు. కనీసం రెండు నెలల ముందు ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకునే పద్దతి టాలీవుడ్ లో రావాలని, అప్పుడే మెరుగైన నాణ్యతతో ఆడియన్స్ కి మంచి సినిమాలు ఇవ్వడం సాధ్యమవుతుందని నొక్కి చెప్పారు. ఆయన చెప్పింది చాలా మంచి విషయం కావడంతో ఇండస్ట్రీ నుంచి కౌంటర్ రాలేదు. పైపెచ్చు సమర్ధించినవాళ్లే ఎక్కువ.
వచ్చే నెల కింగ్ 100 విడుదల కానుంది. ఇప్పటిదాకా వచ్చింది కేవలం ఒక చిన్న టీజర్ మాత్రమే. అందులో కూడా రెండు మూడు ఏఐ షాట్స్ ఉన్నాయనే కామెంట్స్ నాగ్ దృష్టికి వెళ్లాయి. సో మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రిలీజ్ కు కేవలం 37 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ఒక సాంగ్ కూడా రిలీజ్ కాలేదు. కాంపిటీషన్ లో ఉన్న బాలకృష్ణ దాదా నుంచి ఒక పాట, షారుఖ్ ఖాన్ కింగ్ నుంచి ఒక సాంగ్ వచ్చాయి. ఫీడ్ బ్యాక్స్ పక్కనపెడితే ట్రెండ్ అయితే అయ్యాయి.
ఇంకోవైపు వీటికి వారం ముందు వస్తున్న అవెంజర్స్ డూమ్స్‌డే అప్పుడే టికెట్ల అమ్మకాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కింగ్ 100 మాట తప్పకుండా ఉండేందుకు పరుగులు పెడుతోంది. ఇటీవలే నాగార్జున చెప్పిన దాని ప్రకారం ఇంకా కొంచెం ప్యాచ్ వర్క్, ఒక పాట షూట్ పెండింగ్ ఉన్నాయి. మరి ఎందుకు ప్లాన్ చేసుకుని పూర్తి చేయడం లేదో అంతు చిక్కడం లేదని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. బిగ్ బాస్, మెగావర్స్, ఇతర ఈవెంట్స్ అంటూ నాగ్ క్రమం తప్పకుండ బయట కనిపిస్తూనే ఉన్నారు.
ఎట్టి పరిస్థితుల్లో కింగ్ 100 వాయిదా లేకుండా చూడాలనేది నాగార్జున పట్టుదల. అసలే స్వంత బ్యానర్. సమర్ధించుకోవడానికి కూడా లేదు. అందరికీ చెప్పి మనం ఫాలో కాకపోతే ఎలా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో వస్తాయి. ఆర్ కార్తీక్ దర్శకత్వంలో రూపొందిన కింగ్ 100కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్న సంగతి తెలిసిందే. తనేమో ఎల్లమ్మ షూటింగ్ లో బిజీ ఉన్నాడు. కొంచెం వీలు చూసుకుని నాగ్ సినిమా రీ రికార్డింగ్, పాటల పనులు పూర్తి చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుందో.
Gulte Telugu Telugu Political and Movie News Updates