యువత సపోర్ట్ చేస్తున్న కొత్త నగరం

నిన్న రాత్రి ప్రీమియర్లతో ఈ నగరానికి ఏమైంది రిపీట్ విడుదలయ్యింది. ముఖ్యంగా ఒక్క రాత్రిలో హైదరాబాద్ నుంచి కోటి రూపాయల గ్రాస్ నమోదు కావడం మాములు విషయం కాదు. దశాబ్దం వెనుక వచ్చిన సినిమా సీక్వెల్ కి ఇంత క్రేజ్ రావడం అరుదు. యునానిమస్ టాక్ అని కాదు కానీ యూత్ మద్దతు పుష్కలంగా దక్కుతున్న వైనం సోషల్ మీడియాలో గమనించవచ్చు. దర్శకుడు తరుణ్ భాస్కర్ ట్రెండీ ఎంటర్ టైన్మెంట్ వాళ్ళు ఎంజాయ్ చేసిన వైనం ఫీడ్ బ్యాక్ రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది.

కమర్షియల్ గా ఈ నగరానికి ఏమైంది ఏ స్థాయికి వెళ్తుందనేది రెండు మూడు షోలతో డిసైడ్ చేయలేం కానీ ఎలాంటి నెగటివ్ సౌండ్ వినిపించకపోవడం నిర్మాతకు శుభ శకునంగా చెప్పుకోవాలి. అయితే కాంపిటీషన్ లో ఉన్న ఆకాశంలో ఒక తార, ఓమ్ లకు వచ్చే టాక్ ని బట్టి నగరం రేంజ్ ఇంకా పెద్దవుతుందా లేక ఏదైనా కాంప్రోమైజ్ ఉంటుందా అనేది తెలుస్తుంది. జిల్లా కేంద్రాలు, బిసి సెంటర్స్ లో నెమ్మదిగా మొదలైనా క్రమంగా బుకింగ్స్ పెరుగుతున్న వైనం టికెట్ నెంబర్స్ లో చూడొచ్చు.

ఎడతెరిపి లేకుండా వారం పది రోజుల నుంచి ఫ్రెండ్స్ గ్యాంగ్ కలిసి బాగా ప్రమోట్ చేసుకున్న ఈ నగరానికి ఏమైంది రిపీట్ లో లాజిక్ కన్నా మేజిక్ ఎక్కువ పని చేసింది. ట్రెండీ కామెడీతో నవ్వించడమే లక్ష్యంగా తరుణ్ భాస్కర్ రాసుకున్న స్క్రిప్ట్ కి విశ్వక్ సేన్ తో సహా మిగిలిన క్యాస్టింగ్ ఇచ్చిన పెర్ఫార్మన్స్ ప్రశంసలు అందుకుంటోంది. ముఖ్యంగా అభినవ్ గోమటంని వాడుకోవడం ఎలాగూ ఇందులో చూసి తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని ఎపిసోడ్స్ ని ఒంటి చేత్తో నిలబెట్టాడు.

కొన్ని హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ ఈ నగరానికి ఏమైంది రిపీట్ వీకెండ్ వరకు గట్టిగానే నిలబడేలా ఉంది. ఇదే టాక్ కొనసాగితే మటుకు రెండు వారాల థియేటర్ రన్ ఈజీగా దొరుకుతుంది. వయొలెన్స్, హీరోయిజం ఎలివేషన్స్, వైరల్ సాంగ్స్ లేకుండా కల్ట్ మూవీ లవర్స్ ని టార్గెట్ చేసిన సినిమా కావడంతో బ్రేక్ ఈవెన్ అంత ఇబ్బంది కాకపోవచ్చని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ కూడా దక్కితే అంకెలు మరింత పెరుగుతాయి. కాకపోతే కాంపిటీషన్ ని డామినేట్ చేయాలి.