ఈ ఉదయం ‘పుష్ప’ టీం పెద్ద షాకే ఇచ్చింది. సుకుమార్, అల్లు అర్జున్‌ల కలయికలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రాన్ని ఆగస్టు 13న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ‘పుష్ప’ షూటింగ్ ఈ మధ్యనే మొదలైంది. సుకుమార్ ఓ సినిమాను ఎలా చెక్కుతాడో అందరికీ తెలిసిందే కాబట్టి ఈ చిత్రం ఇంత త్వరగా విడుదలవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. అసలు ఈ ఏడాది ఆ చిత్రం విడుదల కాదని అనుకున్న వాళ్లూ ఉన్నారు. కొంచెం వేగం చూపించినా దసరా సమయానికి కానీ సినిమా రెడీ కాదని అనుకుంటున్నారు. అలాంటిది ఆగస్టు 13కే రిలీజ్ అనేసరికి నమ్మబుద్ధి కావట్లేదు. ఇప్పుడు డేట్ ఇచ్చినా.. దాన్ని అందుకుంటారన్న గ్యారెంటీ లేదు అని అభిప్రాయపడుతున్న వాళ్లూ లేకపోలేదు. ఐతే హీరో అల్లు అర్జున్, నిర్మాతల ఒత్తిడికి సుకుమార్ తలొగ్గక తప్పలేదన్నది ఇన్ సైడ్ టాక్.
సుకుమార్ ఇంతకుముందు ఏ సినిమాలకూ లేని స్థాయిలో ‘పుష్ప’ను వేగం చూపిస్తున్నాడట. రోజువారీ తీసే సన్నివేశాల సంఖ్య, ఫుటేజ్ పెరుగుతున్నట్లు సమాచారం. ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లడంలోనే చాలా ఆలస్యం జరిగింది. ఈలోపు ప్రి ప్రొడక్షన్ దశలోనే కోట్లు ఖర్చయిపోయాయి. లాక్ డౌన్ టైంలో పని లేకున్నా టీం అంతటికీ జీతాలివ్వాల్సి వచ్చింది. షూటింగ్ కూడా నెమ్మదిగా చేస్తే ఖర్చు బాగా ఎక్కువైపోతుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు ‘అల వైకుంఠపురములో’కు ముందు చాలా ఎక్కువ గ్యాప్ తీసుకున్న బన్నీకి.. ఆ సినిమా తర్వాత కూడా చాలానే విరామం వచ్చింది. దీని వల్ల తనకెంతో నష్టం జరుగుతోందని అర్థం చేసుకున్న బన్నీ.. ‘పుష్ప’ మేకింగ్ ఆలస్యం కాకూడదని గట్టిగా ఫిక్సయ్యాడట. కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసి మే కల్లా ఖాళీ అయిపోతుండటంతో సాధ్యమైనంత త్వరగా ఆయనతో తాను చేయాల్సిన సినిమాను మొదలుపెట్టాలని.. ఆయనకు కూడా ‘ఆచార్య’కు ముందు చాలా విరామం వచ్చిన నేపథ్యంలో తన కోసం వెయిట్ చేయించొద్దని బన్నీ నిర్ణయించుకున్నాడట. అందుకే నిర్మాతలతో కలిసి సుక్కు మీద ఒత్తిడి తెచ్చి తన వైపు నుంచి ఎంత టైమ్ ఇవ్వడానికైనా, ఎంత కష్టపడటానికైనా సిద్ధమని చెప్పి సినిమాను ఆగస్టు 13నే విడుదల చేసేలా ప్లాన్ చేయించి, ప్రకటన చేయించినట్లు సమాచారం. డేట్ ఇచ్చేయడంతో ఇక సుక్కు ఆలస్యం చేయకుండా జూన్ నెలాఖరుకల్లా షూటింగ్ ముగించాలని టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిసింది.
This post was last modified on January 28, 2021 2:15 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…