సస్పెన్సుకు తెరపడింది. ప్రభాస్ కొత్త సినిమా ‘సలార్’లో కథానాయిక ఎవరో తేలిపోయింది. దిశా పఠాని అని.. ఎవరో కొత్తమ్మాయి అని.. రకరకాల ప్రచారాలు జరిగాయి కానీ.. చివరికి శ్రుతి హాసన్‌ను ఈ చిత్రానికి కథానాయికగా ఖరారు చేశారు. అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. శుక్రవారమే ఈ సినిమా షూటింగ్ ఆరంభం కానుండగా.. ముందు రోజు శ్రుతి పుట్టిన రోజును పురస్కరించుకుని ఆమెనే ‘సలార్’ హీరోయిన్ అనే విషయాన్ని చిత్ర బృందం ప్రకటించింది.
శ్రుతి తెలుగులో పెద్ద స్టార్లతో చేసిన సినిమాలు చాలా వరకు సూపర్ సక్సెస్ అయ్యాయి. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, రవితేజ లాంటి హీరోలతో ఆమె చేసిన సినిమాలు మంచి ఫలితాన్నందుకున్నాయి. మొదట్లో ఐరెన్ లెగ్ ముద్ర వేసుకున్న శ్రుతి.. తర్వాత లక్కీ చార్మ్ అనిపించుకోవడం విశేషం. కొన్నేళ్ల విరామం తర్వాత తెలుగులో ఆమె చేసిన ‘క్రాక్’ బ్లాక్‌బస్టర్ అయింది. రవితేజ ఈ సినిమాతోనే మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో శ్రుతి ‘గోల్డెన్ గర్ల్’ అంటూ పొగిడేస్తున్నారు.
ఈ కోణంలో చూస్తే ‘సలార్’లో ప్రభాస్‌తో శ్రుతి జోడీ కట్టడం పట్ల హర్షం వ్యక్తం అవుతోంది. ఆమె లక్ ఫ్యాక్టర్ ఈ సినిమాకు కూడా కలిసొస్తుందని ఆశిస్తున్నారు. ఐతే ‘క్రాక్’లో శ్రుతి లుక్స్ చూసిన వాళ్లు మాత్రం ‘సలార్’కు ఆమెను కథానాయికగా ఎంచుకోవడం పట్ల నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ‘కాటమరాయుడు’లో మరీ బొద్దుగా, ఔట్ ఆఫ్ షేప్‌తో కనిపించి విమర్శలెదుర్కొన్న శ్రుతి.. ‘క్రాక్’కు వచ్చేసరికి మరీ బక్క చిక్కి కళ కోల్పోయినట్లు కనిపించింది. పాటల్లో ఆమె అవతారం చూసి అభిమానులు షాకైపోయారు. ముఖంలో గ్లో పోయింది. ఎలా ఉన్న శ్రుతి ఎలా తయారైపోయిందో అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆమె ఫ్యాన్స్.
‘క్రాక్’ హిట్టయినప్పటికీ శ్రుతి ఆ సినిమాకు అనుకున్నంత ప్లస్ అయితే కాలేదు. ఇలాంటి లుక్స్‌తో ప్రభాస్ పక్కన ‘సలార్’ లాంటి భారీ చిత్రంలో శ్రుతి ఏం మెరుస్తుంది.. సినిమాకు ఏ విధంగా కలిసొస్తుంది అనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. మధ్యలో ఆమె కొంచెం తన లుక్స్ మీద దృష్టిపెట్టి మళ్లీ ఆకర్షణీయంగా తయారు కావాలని అభిమానులు కోరుకుంటున్నారు.
This post was last modified on January 28, 2021 2:18 pm
అరవింద సమేత.. మహర్షి.. గద్దలకొండ గణేష్.. అల వైకుంఠపురములో... ఇలా ఒక టైంలో తెలుగులో వరుస సక్సెస్‌లతో తిరుగులేని క్రేజ్…
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…