2026 సంవత్సరాన్ని ఘనంగా ఆరంభించిన టాలీవుడ్.. ఆ తర్వాత నాలుగైదు నెలలు బాగా ఇబ్బంది పడింది. కానీ జూన్‌లో పెద్ది వచ్చినప్పటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు కళకళలాడుతున్నాయి. ఆ సినిమా మిగతా ఏరియాల్లో ఆశించిన ప్రదర్శన చేయకపోయినా.. ఏపీ, తెలంగాణ వరకు చాలా బాగా ఆడింది. ఆ తర్వాత మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ చిత్రాలు మంచి ఫలితాలను అందుకున్నాయి. నాగబంధం కూడా ఉన్నంతలో మంచి వసూళ్లే రాబట్టింది.
ప్రస్తుతం చెన్నై లవ్ స్టోరీ జోరు చూస్తున్నాం. నెలాఖరులో శ్రీనివాస మంగాపురం, న్యూటన్స్ థర్డ్ లా లాంటి ప్రామిసింగ్ మూవీస్ రాబోతున్నాయి. ఇవి పేరుకు జులై సినిమాలే కానీ.. వీటి భవితవ్యం తేలేది ఆగస్టులోనే. ఆ నెలలో వేరే చిత్రాలు కూడా టాలీవుడ్‌కు చాలా కీలకంగా మారబోతున్నాయి. చాలామంది హీరోలు, నిర్మాతలు, దర్శకుల కెరీర్లు ఆగస్టు సినిమాల మీద ఆధారపడి ఉండడం గమనార్హం.
ఆగస్టు తొలి వారంలో వచ్చే కొరియన్ కనకరాజు హీరో వరుణ్ తేజ్‌కు, దర్శకుడు మేర్లపాక గాంధీకి ఎంతో కీలకం. వాళ్లిద్దరూ హిట్టు కొట్టి చాలా కాలమైంది. ఆపై ఇండిపెండెన్స్ డే వీకెండ్లో రిలీజయ్యే విశ్వనాథ్ అండ్ సన్స్ మీద ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ ట్రేడ్ వర్గాలు ఎన్నో ఆశలతో ఉన్నాయి. కరుప్పు తర్వాత మరోసారి సూర్య మ్యాజిక్ చేస్తాడని ఆశిస్తున్నారు. తర్వాతి వారం విడుదలయ్యే ఇరుముడి చిత్రం హీరో రవితేజకు, దర్శకుడు శివనిర్వాణకు చాలా కీలకమైన చిత్రం. అది వారి కెరీర్లను నిర్దేశించే సినిమా అనడంలో సందేహం లేదు.
ఇక చివరి వారంలో టాక్సిక్ లాంటి భారీ చిత్రం రానుంది. కేజీఎఫ్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న యశ్.. ఈ చిత్రంతో తనేంటో రుజువు చేసుకోవాల్సి ఉంది. జననాయగన్‌తో దెబ్బ తిన్న వెంకట్ కె.నారాయణ ఈ చిత్రంపై చాలా ఆశలతో ఉన్నాడు. దానికి పోటీగా రానున్న శర్వానంద్, సంపత్ నందిల మూవీ భోగి ఆ ఇద్దరితో పాటు నిర్మాతకూ చాలా ముఖ్యమైన చిత్రమే. మొత్తంగా ఆగస్టు నెలపై వందల కోట్ల భారం ఉంది. మరి ఈ నెల ఫిలిం ఇండస్ట్రీకి సానుకూల ఫలితాలను ఇస్తుందేమో చూడాలి.
This post was last modified on August 1, 2026 9:51 am
2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…
ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…