Political News

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి తన మూలాలు మరవని నేత. కళాకారులకు ఆయనో వరం. ఆంధ్రప్రదేశ్ హస్తకళా మహోత్సవంలో కళాకారులకు ఇచ్చిన హామిని నిలబెట్టుకొని పేద కళా కారుల కంటి దీపంలా నిలిచారు.

15 మందికి ఉచితంగా నేత్ర శస్త్ర చికిత్సలు…

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, లేపాక్షి సంస్థ సంయుక్తంగా ఈ ఏడాది జులై 7 వ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ హస్త కళా మహోత్సవం -2026 నిర్వహించారు. వేడుకలను ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలో కళా కారులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ కొండపల్లి, నరసాపురం, పాలకొల్లు, బొబ్బిలి, శ్రీకాళహస్తి ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు.

పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలిలో ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 143 మంది లేస్, నేత కళాకారులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వారిలో 15 మందికి కేటారాక్ట్ శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించారు. త్వరలోనే వీరికి ఆపరేషన్లు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారిలో 110 మందికి ఉచితంగా కంటి అద్దాలు అందజేయనున్నట్లు చెప్పారు.

పవన్ కళ్యాణ్ సేవలకు సలాం…

ఏదైనా వేడుకలు, ప్రారంభోత్సవాలకు వచ్చినప్పుడు ప్రజా ప్రతినిధులు రకరకాల హామీలు ఇవ్వడం సహజం. హస్త కళా మహోత్సవానికి వచ్చిన డీసీఎం పవన్ కళ్యాణ్ కూడా అలాగే హామీలు ఇస్తున్నట్లు అక్కడికి వచ్చిన కళాకారులు భావించారు. వారం తిరగక ముందే కళాకారుల కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేయడం, కేటారక్ట్ ఆపరేషసన్లకు సిద్ధం చేయడం కళాకారులకు విస్మయం కలిగిస్తుంది. ఇలాంటి నాయకుడు వుంటే ప్రజలకు భరోసా ఉంటుందని నేత కళాకారులు చెప్పుకుంటున్నారు.

This post was last modified on August 1, 2026 6:01 am

Share

Recent Posts

బాలయ్య మనసు మారితే బాక్సాఫీస్ యుద్ధమే

డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…

38 minutes ago

రణబాలి తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్త

సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…

3 hours ago

RTO ఆఫీసుకు వెళ్లకుండానే LLR… టెస్ట్‌లో AI నిఘా!

డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…

5 hours ago

పాపం అల్లు శిరీష్.. ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది

సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…

5 hours ago

ట్విస్ట్…. నారాయణమ్మకు మూలం నవనీతమ్మ ?

నిన్న ఆదర్శ కుటుంబం ఏకె 47 నుంచి విడుదలైన నారాయణమ్మ పాట సోషల్ మీడియాలో డిస్కషన్ కు దారి తీస్తోంది.…

6 hours ago

క్లైమాక్స్ మీద తీవ్ర విమర్శలు… డైరెక్టర్ రియాక్షనేంటి?

గత వారాంతంలో నేచురల్ స్టార్ నాని సినిమా ‘ది ప్యారడైజ్’ గురించి సోషల్ మీడియాలో ఎంత చర్చ జరిగిందో.. తమిళ…

7 hours ago