జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పిల్లలు తప్పు చేయడం సహజమని, వారిని క్షమిస్తున్నానంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇంతకూ ప్రధాని ఏమి చెప్పారంటే….
పిల్లల భాషతో కలత చెందాను …
జంతర్ మంతర్లో విద్యార్థులు చేసిన ఆందోళన దేశంతో పాటు యావత్ ప్రపంచం చూసింది. ఈ ఆందోళన సందర్బంగా విద్యార్థులు నన్ను దుషించారు. స్వర్గస్తురాలైన నా తల్లిని దుషించారు. అయినా నేను వారిని క్షమిస్తున్నాను. వారిది చిన్న పిల్లల చేష్టలు. బాల్యంలో తప్పులు చేయడం సహజం. అయితే ఆ తప్పుల నుంచి పాఠం నేర్చుకోవాలి.
సమాజంలో వున్న ఆక్రోషాన్ని అర్ధం చేసుకోగలను. ఒక్కోసారి పంటి కింద నాలుక పడుతుంది. అలాగని నాలుకను తీసేయలేం కదా. ఇదీ అంతే.. వీళ్లంతా మన పిల్లలే. వీళ్ళ మీద కేసులు పెట్టడం, శిక్షించడం, కోర్టుల చుట్టూ తిప్పడం వలన పరిస్థితులను మార్చలేం. పిల్లలారా రండి.. కలిసి దేశం కోసం పని చేద్దాం అని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు. ఈ వీడియో మీద భిన్నభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
బీజేపీ నాయకుల తిట్ల సంగతేంటి…
విద్యార్థులు దుషించారని బాధ పడుతున్న ప్రధాని మోదీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన దూషణల గురించి కూడా ప్రస్తావించి వుంటే బాగుండేదని కొందరు వాదిస్తున్నారు. విద్యార్థులను ఉద్దేశించి బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ నోరు పారేసుకోవడం, విద్యార్థుల తల్లీ దండ్రులను కూడా నోటికోచ్చినట్లు దూషించడాన్ని గుర్తు చేస్తున్నారు.
మురికి కంపు, వీళ్ళను ఎవరు కంటున్నారు, ఎవరు పెంచుతున్నారంటూ కంగానా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఖండించకుండా కేవలం విద్యార్థులను మాత్రమే తప్పు పట్టడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మన ఇంటి పిల్లలు, ముఖ్యంగా అమ్మాయిలు ఆందోళన చేస్తే అప్పుడు కూడా ఇలాగే దూషిస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ప్రధాని మోదీని విమర్శించడం సమర్ధనీయం కాదని మరికొందరు వాదిస్తున్నారు.
కేసుల సంగతేంటి…
జంతర్ మంతర్ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులపై బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కేసులు నమోదు చేస్తున్న విషయం గురించి ప్రధాని ఎందుకు మాట్లాడలేదని మరికొందరు మాట్లాడుతున్నారు. పేపర్ లీక్ కావడం వలన విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసు కేసులు పెట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఆందోళన విరమించే సమయంలో విద్యార్థులపై కేసులు పెట్టమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఇప్పుడు వందలాది మందిపై కేసులు పెడుతున్నారని, వేధింపులకు గురి చేస్తున్నారని చెబుతున్నారు. వీడియోలో ప్రధాని చెప్పినట్లు విద్యార్థులపై కేసులు ఉపశమహరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
This post was last modified on August 1, 2026 8:59 am
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విజయ్ చెప్పిన ఒకే ఒక్క డైలాగ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. "1967లో అన్నాదురై,…
ఎక్కడైనా దురద పెడితే చేతితో గోక్కుంటాం. లేదంటే పక్కన ఉన్నవాళ్లను కాస్త గోకమని అడుగుతాం. కానీ చైనాలో మాత్రం ఇదే…
తెలంగాణా అసెంబ్లీ ప్రారంభం కావడమే యుద్ధ వాతావరణం నెలకొంది. అసెంబ్లీ గేటు వద్ద ప్రతిపక్ష బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను పోలీసులు అడ్డుకోవడంతో…
ఢిల్లీలో హాస్టల్ భవనం కూలిపోయిన ఘటనలో ఇప్పుడు మరో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. ఏడుగురు మరణించిన విషయం తెలిసిందే.…
తెలుగు సినిమాల్లోకి పరభాషా నటులను క్యారెక్టర్, విలన్ పాత్రల్లోకి తీసుకోవడం కొత్తేమీ కాదు. ఇది దశాబ్దాలుగా నడుస్తున్న సంప్రదాయమే. సొంత…
చెప్పిన డేటుకు సినిమాను రిలీజ్ చేస్తాడని నేచురల్ స్టార్ నానికి ఉన్న పేరును ‘ది ప్యారడైజ్’ బాగా దెబ్బ తీసింది.…