Movie News

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కాలేకపోయింది. హిందీలో డిజాస్టర్ అనే మాట చిన్నది. కేరళలో హ్యాపీ రీ రిలీజ్ కంటే తక్కువ వసూళ్లు వచ్చాయి. మా ఇంటి బంగారంకు తొలుత మిశ్రమ స్పందన వినిపించింది. తీరా చూస్తే సమంత వంద కోట్ల గ్రాస్ లాగేసింది. లెనిన్ కూడా ఇంచుమించు ఇదే తరహాలో పోరాటం చేసి సూపర్ హిట్ వేయించుకుంది.

ఇక చెన్నై లవ్ స్టోరీ సంగతి తెలిసిందే. సెకండాఫ్ వల్ల ఇది నిలవడం కష్టమని చాలా మంది తీర్పులు ఇచ్చారు. కానీ థియేటర్లలో జరిగింది వేరు. స్టీవెన్ శంకర్ ప్రేమకథను ఆదరించారు. అంతకు ముందు ఎక్కువ శాతం మోసిన రావు బహదూర్ కమర్షియల్ ఫెయిల్యూర్ కాగా రెండు రేటింగ్ తో నాగబంధం మొదటి మూడు రోజులు మంచి వసూళ్లు తెచ్చింది. ఫ్లాప్ తప్పలేదు కానీ ఉన్నంతలో బండి లాగేసింది. వీటిలో కొన్ని విషయాల గురించి నిర్మాత ఎస్కెఎన్ మా ఇంటర్వ్యూలో ఓపెనయ్యారు.

చాలా బాగున్నాయని ప్రచారం చేసుకున్న కొన్ని సినిమాలకు ప్రీమియర్లు వేస్తారని, కానీ మౌత్ టాక్ తేడా వచ్చినప్పుడు అది వసూళ్లుగా మారకుండా అడ్డం పడుతుందని క్లారిటీ ఇచ్చారు. ట్విట్టర్ లో మోసినా, తిట్టినా వాటి ప్రభావం పరిమితమేనని, నలుగురు బాగుందంటే జనాలు థియేటర్లకు వచ్చేస్తున్నారని కుండబద్దలు కొట్టారు. పైన చెప్పిన వాటిలో నాలుగు ఉదాహరణలు కూడా తీసుకున్నారు. చెన్నై లవ్ స్టోరీకి కల్ట్ క్లాసిక్ అని రిలీజ్ ముందే ప్రచారం చేసింది ఎస్కెఎన్ బృందమే.

సక్సెస్ అయ్యింది కాబట్టి సరిపోయింది కానీ లేదంటే అదే పాయింట్ మీద సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగేది. రాబోయే రోజుల్లో కంటెంట్ నే నమ్ముకున్న సినిమాలు, విజువల్ గ్రాండియర్స్ గా వస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాలు చాలా ఉన్నాయి. ఏవి ఎలా ఆడతాయో ముందే చెప్పలేని పరిస్థితుల్లో జరుగుతున్న ఫలితాలను ట్రేడ్ నిశితంగా పరిశీలిస్తోంది. రెండేళ్లకో హిట్టు కొడుతూ నిర్మాతగా ఎస్కెఎన్ లెక్కలు మాత్రం పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవుతున్నాయి. 

This post was last modified on July 31, 2026 10:27 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

9 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

24 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

25 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

2 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago