Political News

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ… వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన నేతగానూ ఇటీవలే నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును నెలకొల్పారు. సమీప భవిష్యత్తులోనే కాదు… భవిష్యత్తులో ఏ ఒక్క నేత కూడా మోదీ రికార్డును బద్దలు కొట్టడం దుస్సాధ్యమేనని చెప్పక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో దేశ ప్రధానిగా మోదీ ఎంతకాలం పాటు ఉంటారన్న విషయంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోదీ తనకు తాను ఇక దిగిపోతానని చెప్పేదాకా… దేశానిక ప్రధానిగా మోదీనే కొనసాగుతారని పవన్ వ్యాఖ్యానించారు.

విజయనగరం జిల్లాలోని భోగాపురంలో కొత్తగా నిర్మించిన అల్లూరి సీతారామారాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని హోదాలో మోదీ శనివారం ఉదయం లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కూటమి సర్కారు నుంచి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఇటీవలే భుజానికి శస్త్ర చికిత్స జరిగిన నేపథ్యంలో చేతికి కట్టుతోనే పవన్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్… మోదీ పడ్డ కష్టాన్ని తనదైన శైలిలో చెప్పుకొచ్చారు. 

దేశ పురోభివృద్దికి ప్రదాని హోదాలో నరేంద్ర మోదీ శక్తివంచన లేకుండా పనిచేస్తున్నారని పవన్ అన్నారు. ప్రధానిగా పదవీ ప్రమాణం చేసిన నాటి నుంచి మోదీ ఒక్కటంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలేదని పవన్ గుర్తు చేశారు. వెరసి అలుపెరని శ్రామికుడిగా మారిన మోదీ… దేశాన్ని పురోభివృద్దిలో పయనించేలా చేస్తున్నారని అన్నారు. అలాంటి ప్రధాని మోదీని దేశ యువత దూషించిందని… ఈ విషయం తనను చాలా భాధకు గురి చేసిందని.. మోదీని తిడుతుంటే నా కంట్లో నీళ్లు తిరిగాయని అన్నారు. జంతర్ మంతర్ వద్ద ఇటీవల జరిగిన నిరసనల్లో దేశ యువత ప్రధాని మోదీపై నిందలేసిందని విచారం వ్యక్తం చేశారు.

తనపై నిందలు మోపిన దేశ యువతపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి బదలుగా… వారిని క్షమించారని పవన్ గుర్తు చేశారు. దేశం కోసం శ్రమిస్తున్న మోదీ లాంటి నేతలను మరింతగా ప్రోత్సహించాలని ఆయన పిలుపునిచ్చారు. మోదీ పనితీరును గుర్తించేలా దేశ యువతకు తెలివితేటలను ఇవ్వాలని కూడా ఆయన ఆకాంక్షించారు. దేశ యువతకు వారి తల్లిదండ్రులు విద్యాబుద్ధులు నేర్పాల్సి ఉందని కూడా పవన్ అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం మోదీని ఓడించే నేత దేశంలో లేరన్న పవన్.. మోదీ తనకు తానుగా ఇక ప్రదాని పదవి నుంచి దిగిపోతానని భావించే దాకా… దేశానికి ప్రధానిగా మోదీనే కొనసాగుతారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

This post was last modified on August 1, 2026 1:54 pm

Share

Recent Posts

ఇన్‌స్పైరింగ్… 70 వయసు దగ్గరలో 7 సినిమాలు

మోహన్ లాల్ వయసు ప్రస్తుతం 66 సంవత్సరాలు. ఇంకో నాలుగేళ్లు పోతే ఏడు దశాబ్దాలు పూర్తి చేసుకోబోతున్నారు. ఇంత ఏజ్…

3 hours ago

ఫోక్ డ్యాన్స‌ర్ల ప‌ర్స‌న‌ల్ గొడ‌వ‌… ర‌చ్చ ర‌చ్చ‌

భ‌ర్త ఎవ‌రితోనో సంబంధం పెట్టుకుంటాడు. భార్యకు అనుమానం వ‌స్తుంది. విష‌యం రూఢి చేసుకుంటుంది. భ‌ర్త‌ను జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తూ.. ప‌రాయి మ‌హిళ‌తో…

3 hours ago

విజయసాయి కొత్త పార్టీ… వైసీపీలో గుబులు?

ఎట్టకేలకు మాజీ రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి రాజకీయ పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారానికి…

4 hours ago

తెలంగాణ సింగిల్ స్క్రీన్ల రేట్లు పెరుగుతాయా?

మిగ‌తా ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పోలిస్తే ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధ‌ర‌లు ఎక్కువ. పైగా పెద్ద సినిమాలు రిలీజైన‌పుడు అద‌న‌పు…

4 hours ago

మైకు ప‌ట్టే చంద్ర‌బాబు… కెమెరా ప‌డితే!?

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు మైకు ప‌ట్ట‌డం బాగా తెలుసు. ఆయ‌న మైకు అందుకుంటే.. వినేవారికైనా బోర్ కొడు…

6 hours ago

ఇరుకైన మనసుంటే థియేటర్లు ఎలా వస్తాయి

మన తెలుగు ప్రేక్షకులు నిండు మనసుతో భాష భేదం లేకుండా కంటెంట్ బాగుంటే చాలు వసూళ్లు ఇచ్చి మరీ బ్లాక్…

6 hours ago