బీజేపీ నిర్వహించాలని అనుకున్న రథయాత్రకు బ్రేకులు పడ్డాయి. దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల ధ్వంసం తదితర కారణాలతో బీజేపీ రథయాత్ర చేయాలనుకున్న విషయం అందరికీ తెలిసిందే. తిరుపతిలోని కపిలతీర్ధం టు విజయనగరం జిల్లాలోని రామతీర్ధం వరకు ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్రకు రూటుమ్యాపు కూడా రెడీ చేసుకున్నది. యాత్ర కోసం పోలీసులను అనుమతి కూడా కోరారు.
అయితే ఊహించని విధంగా రాష్ట్రంలో పంచాయితి ఎన్నికల నోటిఫికేషన్ జారీ అవటంతో రథయాత్రకు బ్రేకులుపడ్డాయి. సుప్రింకోర్టు తీర్పు వల్ల పంచాయితి ఎన్నికలను ఆటంకాలు తొలగిపోవటంతో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రిలీజైపోయింది. పైగా ఏకగ్రీవాలు జరక్కుండా స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయటంతో దాదాపు అన్నీ పంచాయితిల్లోను ఎన్నికలు అనివార్యమయ్యేట్లుంది.
ఈ నేపధ్యంలోనే బీజేపీ+జనసేన పార్టీలు కూడా ఎన్నికల్లో నామినేషన్లపై దృష్టిపెట్టాయి. మొదటిదశలో ఎన్నికలు జరగబోయే ప్రతి పంచాయితిలోను మిత్రపక్షాల తరపున నామినేషన్ల వేయించాలని ఇఫ్పటికే డిసైడ్ చేశాయి. అందుకనే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రాధాన్యత ఇచ్చి రథయాత్రను వాయిదా వేస్తున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.
ఫిబ్రవరి 4వ తేదీ నుండి రథయాత్ర ప్రారంభమైతే రాష్ట్రంలో ఎక్కడో ఓ చోట గొడవలు జరగటం ఖాయమనే అందరు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తొందరలో జరగబోయే తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ మతపరమైన రాజకీయాల జోరు పెంచింది. ఇందులో భాగంగానే జగన్మోహన్ రెడ్డి హిందుమతానికి వ్యతిరేకమనే నినాదాన్ని ఎత్తుకుంది. బీజేపీ నినాదం కారణంగా గొడవలు జరుగుతాయని అనుకున్నారు. అయితే పంచాయితి ఎన్నికల కారణంగా రథయాత్ర వాయిదా పడటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
This post was last modified on January 28, 2021 11:25 am
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…
బతుకుదెరువు కోసం ఎక్కడెక్కడికో వెళ్లిన వారు తమ ఇళ్లకు వెళుతున్నారు. ఇంటికొచ్చిన వారు బతుకుదెరువు కోసం కార్యస్థానాలకు బయలుదేరారు. అందరికీ…
బాలీవుడ్లో ఒకప్పుడు నిలకడగా సూపర్ హిట్ సినిమాలు అందిస్తూ వైభవం చూసిన నటుడు అక్షయ్ కుమార్. ఖాన్ త్రయం భారీ…
ఏపీలోని కూటమి సర్కారు బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో జరిగిన తొక్కిసలాటపై న్యాయ విచారణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ…
దేశంలో ఇంకా అరాచకాలు జరుగుతూనే ఉన్నాయి. నానాటికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో పోటీ పడి మరీ పరుగులు పెడుతుంటే… దేశ…
రామ్ గోపాల్ వర్మలో ఎప్పుడూ లేని పశ్చాత్తాప భావన చూస్తున్నాం ఇప్పుడు. ఒకప్పుడు రంగీలా, సత్య లాంటి క్లాసిక్స్ తీసిన…